బ్రెజిల్ లో జరుగుతున్న వరల్డ్ షూటింగ్ టోర్నమెంట్ లో భారత్ స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటన్ అభిషేక్ వర్మ అదరగొట్టాడు. ఫైనల్లో ఏకంగా 244.2 పాయింట్లు సాధించి స్వర్ణం పతకాన్ని సాధించాడు.

అయితే ఈ విజయం ద్వారా వర్మ కేవలం దేశానికి స్వర్ణాన్ని అందిచడమే కాదు మరో బంపరాఫర్ పొందాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ కు భారత్ తరపున అర్హత సాధించాడు. ఇలా పురుషుల విభాగంలో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన మొదటి షూటర్ గా వర్మ నిలిచాడు.

ఇదే 10మీటర్ల  విభాగంలో మరో భారత షూటర్ సౌరభ్ తివారి కాంస్యం సాధించాడు. 221.9 పాయింట్లతో అతడు మూడో స్థానంలో నిలిచాడు. ఇక 243.1 పాయింట్లతో  టర్కీ ఆటగాడ ఇస్మాయిల్ రెండో స్థానంలో నిలిచి రజతం సాధించాడు. ఇలా  పదిమంది పోటీపడ్డ ఫైనల్లో రెండు పతకాలు భారత్ నే వరించడం విశేషం.