యువ క్రికెటర్ బుమ్రా బౌలింగ్ లో తాను ఆడనని చెబుతున్నాడు ముంబయి ఇండియన్స్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్.  ఒకవేళ బుమ్రా బౌలింగ్ లో ఆడడాల్సి వస్తే... నాకు బౌలింగ్ చేయకు అని చెప్పేస్తాను అంటున్నారు. 

యువ క్రికెటర్ బుమ్రా బౌలింగ్ లో తాను ఆడనని చెబుతున్నాడు ముంబయి ఇండియన్స్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. ఒకవేళ బుమ్రా బౌలింగ్ లో ఆడడాల్సి వస్తే... నాకు బౌలింగ్ చేయకు అని చెప్పేస్తాను అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో యువరాజ్‌, బుమ్రా ఇద్దరూ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ప్రపంచకప్‌ దగ్గరపడుతున్న నేపథ్యంలో యూవీ భారత క్రికెట్‌ జట్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ప్రపంచంలోనే అత్యుత్తమ ముగ్గురు బౌలర్లలో బుమ్రా కచ్చితంగా ఉంటాడని యువీ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌ ఆడే బౌలర్లలో బుమ్రానే ఫేవరెట్‌ బౌలర్‌ అని తెలిపాడు. బంతితో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థుడు బుమ్రా అని అన్నారు. అతను ఎంతో నిలకడగా రాణిస్తున్నాడని..అతను బౌలింగ్‌ వేస్తుంటే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ గుండెల్లో భయం మొదలవుతుందని చెప్పుకొచ్చారు.

తన బౌలింగ్ లో తాను కూడా ఆడలేనని చెప్పాడు. నెట్స్ లో కూడా బుమ్రా బౌలింగ్ తట్టుకోవడం కష్టమని చెప్పాడు. ఈ వరల్డ్ కప్ లో భారత్ సత్తా చాటుతుందని యువీ ఆశాభావం వ్యక్తం చేశారు.