MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • T20 World Cup 2026 : పాకిస్థాన్ తప్పుకుంటే మళ్లీ బంగ్లాదేశ్ ఎంట్రీ? వరల్డ్ కప్‌లో సంచలన ట్విస్ట్ !

T20 World Cup 2026 : పాకిస్థాన్ తప్పుకుంటే మళ్లీ బంగ్లాదేశ్ ఎంట్రీ? వరల్డ్ కప్‌లో సంచలన ట్విస్ట్ !

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 ఆరంభానికి 10 రోజులే ఉన్నా పాకిస్థాన్ పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. పాక్ తప్పుకుంటే ఆ స్థానంలో బంగ్లాదేశ్‌కు ఐసీసీ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఆసక్తిని పెంచుతున్న ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 27 2026, 05:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పాక్ కొంపముంచనున్న సొంత నిర్ణయం.. వరల్డ్ కప్‌లోకి బంగ్లా ఎంట్రీ?
Image Credit : X/Bangladesh Cricket

పాక్ కొంపముంచనున్న సొంత నిర్ణయం.. వరల్డ్ కప్‌లోకి బంగ్లా ఎంట్రీ?

టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభం కావడానికి ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ మెగా ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ టోర్నమెంట్‌లో దాయాది దేశం పాకిస్థాన్ పాల్గొంటుందా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఆ జట్టునే చిక్కుల్లో పడేసేలా ఉన్నాయి.

ఒకవేళ పాకిస్థాన్ ఈ టోర్నమెంట్ ఆడేందుకు నిరాకరిస్తే, అది వారికి పెద్ద నష్టాన్ని కలిగించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే, పాకిస్థాన్ తప్పుకుంటే ఆ స్థానంలో బంగ్లాదేశ్‌ను తిరిగి టోర్నమెంట్‌లోకి ఆహ్వానించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పాక్ ప్రధానితో భేటీ తర్వాత కూడా వీడని సస్పెన్స్
Image Credit : Social media

పాక్ ప్రధానితో భేటీ తర్వాత కూడా వీడని సస్పెన్స్

టీ20 వరల్డ్ కప్ 2026 ఆరంభానికి సమయం దగ్గరపడుతున్నా, వివాదాలు మాత్రం సద్దుమణిగేలా కనిపించడం లేదు. బంగ్లాదేశ్ ఇప్పటికే టోర్నమెంట్ రేసు నుండి బయటపడగా, ఇప్పుడు పాకిస్థాన్ కూడా నాటకీయ పరిణామాలకు తెరలేపింది.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మోహ్సిన్ నక్వీ సోమవారం ఒక కీలక ప్రకటన చేశారు. వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌లో తమ జట్టు పాల్గొనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. ఈ విషయంపై చర్చించేందుకు ఆయన పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌తో సమావేశమయ్యారు.

ఈ సమావేశం అనంతరం స్పష్టమైన నిర్ణయం వెలువడుతుందని అందరూ భావించారు. కానీ, పీసీబీ చీఫ్ తన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ట్విస్ట్ ఇచ్చారు. వరల్డ్ కప్‌లో పాల్గొనడంపై తుది నిర్ణయం శుక్రవారం లేదా వచ్చే సోమవారం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Related Articles

Related image1
Tilak Varma : పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.. రోహిత్ శర్మ ఫేవరెట్ అతడే !
Related image2
WPL : స్మృతి, సోఫీలకు సాధ్యం కానిది నాట్ సీవర్ చేసి చూపించింది.. డబ్ల్యూపీఎల్‌లో తొలి సెంచరీ
36
పాకిస్థాన్ డ్రామా వెనుక అసలు కారణం ఇదేనా?
Image Credit : Getty

పాకిస్థాన్ డ్రామా వెనుక అసలు కారణం ఇదేనా?

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు సపోర్టుగా పాకిస్థాన్ ఈ డ్రామా ఆడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుండి తప్పించడం, ఆ తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు టీ20 వరల్డ్ కప్ జరిగే స్టేడియాల విషయంలో భద్రతా పరమైన ఆందోళనలు లేవనెత్తడం తెలిసిన విషయమే.

ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ, ఐసీసీతో బంగ్లాదేశ్ బోర్డుకు విభేదాలు తలెత్తాయి. ఇప్పుడు పాకిస్థాన్ తన పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌కు సంఘీభావం తెలిపేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ప్రపంచ కప్‌ను బహిష్కరించాలనే ఆలోచనలో పీసీబీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యూహం పాకిస్థాన్‌కే బెడిసికొట్టే ప్రమాదం ఉంది.

46
ఐసీసీ మాస్టర్ ప్లాన్.. బంగ్లాదేశ్‌కు బంపర్ ఆఫర్?
Image Credit : Getty

ఐసీసీ మాస్టర్ ప్లాన్.. బంగ్లాదేశ్‌కు బంపర్ ఆఫర్?

మీడియా రిపోర్టుల ప్రకారం.. ఒకవేళ పాకిస్థాన్ ఈ టోర్నమెంట్ నుండి వైదొలగాలని నిర్ణయించుకుంటే, ఐసీసీ వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనుంది. పాకిస్థాన్ స్థానంలో బంగ్లాదేశ్‌కు మొదటి అవకాశం ఇవ్వాలని ఐసీసీ భావిస్తోంది.

రిపోర్ట్ ప్రకారం ఒక అధికారి మాట్లాడుతూ.. "పాకిస్థాన్ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటే, గ్రూప్-ఏలో వారి స్థానాన్ని బంగ్లాదేశ్ భర్తీ చేస్తుంది. అంతేకాకుండా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) కోరిక మేరకు వారి మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలో నిర్వహించే అవకాశం కల్పిస్తారు. దీనివల్ల రవాణా పరంగా కూడా పెద్దగా ఇబ్బందులు ఉండవు" అని తెలిపారు.

56
గ్రూప్-ఏ సమీకరణాలు మారతాయా?
Image Credit : Getty

గ్రూప్-ఏ సమీకరణాలు మారతాయా?

టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ ఎంట్రీ అనేది పూర్తిగా పాకిస్థాన్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఫిబ్రవరి 7న జరగబోయే తొలి మ్యాచ్‌కు ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో ఐసీసీ తీసుకునే నిర్ణయాలు కీలకం కానున్నాయి.

బంగ్లాదేశ్‌ను తిరిగి పిలిపించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, పాకిస్థాన్ మొండిపట్టు వీడకపోతే మాత్రం సమీకరణాలు మారిపోతాయి. పాక్ స్థానంలో బంగ్లాదేశ్ వస్తే, గ్రూప్-ఏ మ్యాచ్‌ల షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది. శ్రీలంకలో ఈ మ్యాచ్‌లు జరగడం దాదాపు ఖాయం.

66
ఒప్పందాల ఉల్లంఘన.. పీసీబీకి చిక్కులే
Image Credit : Getty

ఒప్పందాల ఉల్లంఘన.. పీసీబీకి చిక్కులే

వాస్తవానికి, పాకిస్థాన్ ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ 2026 కోసం తమ జట్టును ప్రకటించింది. జట్టును ప్రకటించిన తర్వాత టోర్నమెంట్ నుండి తప్పుకోవడం అనేది చాలా పెద్ద తప్పు అవుతుంది. ఇది పీసీబీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐసీసీ మధ్య జరిగిన ఒప్పందాలను ఉల్లంఘించడమే అవుతుందని రిపోర్టులు చెబుతున్నాయి.

మోహ్సిన్ నక్వీ చెప్పినట్లుగా శుక్రవారం లేదా సోమవారం వరకు నిర్ణయం వాయిదా పడితే, ఆ తర్వాత వేరే జట్టును తీసుకోవడానికి ఐసీసీకి తగినంత సమయం ఉండకపోవచ్చు. అందుకే పాకిస్థాన్ చివరి నిమిషంలో మనసు మార్చుకుని టోర్నమెంట్‌లో పాల్గొనే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా, రాబోయే వారం రోజులు క్రికెట్ ప్రపంచంలో ఏం జరగబోతోందో వేచి చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
పాకిస్తాన్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Recommended image3
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Related Stories
Recommended image1
Tilak Varma : పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.. రోహిత్ శర్మ ఫేవరెట్ అతడే !
Recommended image2
WPL : స్మృతి, సోఫీలకు సాధ్యం కానిది నాట్ సీవర్ చేసి చూపించింది.. డబ్ల్యూపీఎల్‌లో తొలి సెంచరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved