Asianet News TeluguAsianet News Telugu

సన్ రైజెస్: ధోనీ సేనతో ఫైనల్లో ఆడేది హైదరాబాదే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) క్వాలిఫయర్ - 2 మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్ కతా నైట్ రైడర్స్ ముందు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

IPL 2018: Qualifier 2, SRH vs KKR

కోల్‌కతా: క్వాలిఫయిర్ 2లో కోల్ కతా నైట్ రైడర్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ 13 పరుగులు తేడాతో విజయం సాధించింది. క్వాలిఫయిర్ 1ల ో చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడిన మ్యాచునే తలపించినప్పటికీ చివరి ఓవరులో బ్రాత్ వైట్ వరుసగా రెండు వికెట్లు తీయడంతో కోల్ కతా నైట్ రైడర్స్ ఓడిపోయింది. కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లు సమిష్టిగా రాణించి విజయాన్ని అందించారు. దీంతో ఐపిఎల్ ఫైనల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ధోనీ సేనతో ఈ నెల 27వ తేదీన తలపడనుంది.

కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్లు మంచి ఆరంభాన్నే అందించారు. లీన్ (31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు) , నరైన్ (13 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 26 పరుగులు) దూకుడుగా ఆడుతూ స్కోరును పెంచారు. రైనా (16 బంతుల్లో 22 పరుగులు) ఫరవా లేదనిపించాడు. 

అయితే, ఆ తర్వాత కెప్టెన్ దినేష్ కార్తిక్ తో పాటు ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు. చివరలో శుబ్నం గిల్ (20 బంతుల్లో 30 పరుగులు) ఉన్నంత సేపు మ్యాచ్ హైదరాబాద్ చేతికి రావడం కష్టమే అనిపించింది. కానీ హైదరాబాద్ బౌలర్లు మ్యాచును తమ వైపు తిప్పుకున్నారు. 

హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా, సిద్ధార్థ కౌల్, బ్రాత్ వైట్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. షకీబ్ అల్ హసన్ కు ఓ వికెట్ లభించింది. రషీద్ ఖాన్ అటు బ్యాటింగులోనూ ఇటు బౌలింగులోనూ రాణించడంతో హైదరాబాద్ విజయం సాధించగలిగింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) క్వాలిఫయర్ - 2 మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్ కతా నైట్ రైడర్స్ ముందు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి  బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ జట్టులో చివరలో రషీద్ ఖాన్ దూకుడుగా ఆడడంతో గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. రషీద్ ఖాన్ 10 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

ధావన్‌‌(34; 24 బంతుల్లో 4 ఫోర్లు,1 సిక‍్సర్‌), వృద్ధిమాన్‌ సాహా(35; 27 బంతుల్లో 5 ఫోర్లు), షకిబుల్‌ హసన్‌(28; 24 బంతుల్లో 4 ఫోర్లు)లు స్కోరును పెంచడంలో తమ వంతు పాత్ర పోషించారు, 

సన్‌రైజర్స్‌ 56 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో శిఖర్‌ ధావన్‌ తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత కేన్‌ విలియమ్సన్‌(3) వెంటనే ఔట్ కావడంతో సన్ రైజర్స్ కష్టాల్లో పడింది. కేన్ విలియమన్స్ ఔట్ కావడంతో సన్‌రైజర్స్‌ 60 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. 

అయితే, దీపక్‌ హుడా, షకిబుల్‌ హసన్‌ పరిస్థితిని చక్కదిద్దారు. జట్టు స్కోరు 113 పరుగుల వద్ద షకిబుల్‌ రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత బ్రాత్‌వైట్‌(8), యూసఫ్‌ పఠాన్‌(3)లు తీవ్రంగా నిరాశపరిచారు.  

రషీద్‌ ఖాన్‌ దూకుడు వల్ల సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లు తీయగా, నరైన్‌, పీయూష్‌ చావ్లా, శివం మావిలు తలో వికెట్‌ తీశారు.

Follow Us:
Download App:
  • android
  • ios