ఐపీఎల్‌-11 ఫైనల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక‍్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2లో సన్‌రైజర్స్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది. ఇరు జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ పైచేయి సాధించింది. 

బ్యాటింగ్‌లో అదరగొట్టిన రషీద్‌ ఖాన్‌ (10 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 34 నాటౌట్‌), బౌలింగ్‌ (3/19)లో ఎప్పటిలాగే చెలరేగి జట్టుకు ఆపద్బాంధవుడిగా మారాడు. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 14 పరుగుల తేడాతో నెగ్గి ఫైనల్లో అడుగుపెట్టింది. బ్యాటుతో కేవలం 10 బంతుల్లో 34 పరుగులు సాధించాడు.. 150కి పరిమితమవుతుందనుకున్న సన్‌రైజర్స్‌ ఏకంగా 174 పరుగులతో ఇన్నింగ్స్‌ ముగించింది. బంతితో 4 ఓవర్లేసి 19 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.. అలవోకగా గెలిచేలా కనిపించిన నైట్‌రైడర్స్‌ ఓటమి ఉచ్చులో చిక్కుకుంది. ఇవి చాలదన్నట్లు ఫీల్డింగ్‌లోనూ పాదరసంలా కదిలి రెండు ముఖ్యమైన క్యాచ్‌లను అందుకున్నాడు, ఒక రనౌట్లోనూ భాగస్వామి అయ్యాడు. ఇదీ ఐపీఎల్‌-11 రెండో క్వాలిఫయర్లో రషీద్‌ ఆల్‌రౌండ్‌ జోరు సాగిన తీరు.