క్రీడా ప్రపంచంలో విషాదం... భారత హాజీ లెజెండ్ మైఖేల్ ఖిండో కన్నుమూత...
1975 హాకీ ప్రపంచకప్ విజేతతో పాటు, 1972లో ఒలింపిక్స్ కాంస్య పతక విజేతగా నిలిచిన భారత హాకీ జట్టులో సభ్యుడిగా ఉన్న మైఖేల్ ఖిండో...
మైఖేల్ ఖిండో మృతికి నివాళి అర్పించిన హాకీ ఇండియా...
2020 ఏడాది వెళుతూ వెళుతూ క్రీడా ప్రపంచంలో విషాదాన్ని నింపివెళ్లింది. భారత హాజీ లెజెండరీ ప్లేయర్ మైఖేల్ ఖిండో, తుది శ్వాస విడిచారు. 73 ఏళ్ల మైఖేల్ ఖిండో... 1975 హాకీ ప్రపంచకప్ విజేతతో పాటు, 1972లో ఒలింపిక్స్ కాంస్య పతక విజేతగా నిలిచిన భారత హాకీ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నారు.
కొన్నాళ్లు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మైఖేల్ ఖిండోకి ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. ఒలింపిక్ కాంస్య పతకంతో పాటు ప్రపంచకప్‌లో 3 పతకాలను గెలుచుకున్న జట్టులో సభ్యుడైన మైఖేల్ ఖిండోకి మృతికి హాకీ ఇండియా సంతాపం వ్యక్తం చేసింది.
‘లెజెండరీ హాకీ ఒలింపియన్ మైఖేల్ కిండోకి ప్రగాఢ నివాళులు తెలియచేస్తున్నాం. త్రివర్ణ పతాకాన్ని ధరించిన మొదటి ట్రైబల్ డాన్... ఒలింపిక్ గేమ్స్‌లో ఓ కాంస్య పతకాన్ని, వరల్డ్‌కప్స్‌లో మూడు విభాగాల్లో మెడల్స్ సాధించారు కిండో. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం...’ అంటూ ట్వీట్ చేసింది ఒడిస్సా స్పోర్ట్స్.