భారత భాక్సర్ అమిత్ పంగల్ అంతర్జాతీయ స్ధాయిలో మరోసారి సత్తా చాటాడు. రష్యా వేదికన జరుగుతున్న వరల్డ్ భాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో అతడు అదరగొట్టాడు. ఇప్పటికే  ప్రత్యర్థులను తన పదునైన పంచులతో మట్టికరిపిస్తూ సెమీఫైనల్ కు  దూసుకొచ్చిన పంగల్ తాజాగా  విజయాన్ని అందులోనూ విజయం సాధించాడు. దీంతో ఈ  ప్రతిష్టాత్మక టోర్నీలో ఫైనల్ కు చేరిన మొట్టమొదటి భారత భాక్సర్ గా చరిత్ర సృష్టించాడు. ఫైనల్లో అతడు విజయం సాధిస్తే భారత్ కు మొదటి స్వర్ణం లభించిన ఆటగాడిగా పంగల్ చరిత్రలో నిలిచిపోతాడు. 

ఇవాళ(శుక్రవారం) 52 కిలోల విభాగంలో పంగల్ సెమీఫైనల్లో తలపడ్డాడు. కజకిస్థాన్ భాక్సర్ సకేన్ బిబోస్సినోవ్ తో హోరాహోరీగా తలపడ్డ పంగల్ చివరకు 3-2 తేడాతో విజేతగా నిలిచాడు. దీంతో ఫైనల్ కు అర్హత సాధించాడు. దీంతో కనీసం సిల్వర్ మెడల్ ను ఖాయం చేసుకున్న అతడు గోల్డ్ కోసం శనివారం ఫైనల్ పోరులో తలపడనున్నాడు. ఇందులో  కూడా పంగల్ గెలుపొంది భారత్  కు మొదటి స్వర్ణ పతకాన్ని అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

ఇక ఇదే భాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో 63 కేజీల విభాగంలో మనీష్ కౌశల్ సేమీ ఫైనల్ నుండే వెనుదిరిగాడు. క్యూబాకు చెందిన టాప్ సీడ్ భాక్సర్ ఆండీ క్రూజ్ చేతిలో ఓడిపోయి కేవలం రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. 

శనివారం 52కేజీల విభాగంలో జరిగే ఫైనల్లో పంగల్ ఉజ్బెకిస్థాన్ భాక్సర్ శఖోబిదిన్  తో తలపడనున్నాడు. అతన్ని ఓడిస్తే పంగల్ మొదటిసారి వరల్డ్ ఛాంపియన్  గా నిలిచిన భారత్ భాక్సర్ గా అవతరిస్తాడు. ఇప్పటివరకు  విజేందర్‌ (2009), వికాస్‌ కృషన్‌ (2011), శివ థాపా (2015), గౌరవ్‌ బిధురి (2017)లు ఈఛాంపియన్ షిప్ లో కాంస్య పతకాలను మాత్రమే సాధించారు. స్వర్ణానికి పంగల్ మరో అడుగు దూరంలో మాత్రమే నిలిచాడు.