Asianet News TeluguAsianet News Telugu

భారత అథ్లెట్లకి అరుదైన గౌరవం... స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అతిథులుగా...

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథులుగా భారత అథ్లెట్లు...

స్వయంగా ఆహ్వానించనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ...

Indian Athletes as a Special Guests in Independence Day Celebration in Redfort CRA
Author
India, First Published Aug 3, 2021, 4:59 PM IST

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్లకు అరుదైన గౌరవం దక్కనుంది. అంతర్జాతీయ వేదికపై దేశగౌరవం నిలబెట్టేందుకు పోరాడిన భారత అథ్లెట్లు, ఆగస్టు 15న ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు.

దేశరాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో వేడుకులకు హాజరయ్యే 127 మంది అథ్లెట్లు, ఇండిపెండెంట్ డే సెలబ్రేషన్స్ ముగిసిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. ఒలింపిక్స్‌కి వెళ్లిన అథ్లెట్లను ప్రత్యేకంగా కలిసి, అభినందనలతో పాటు ధన్యవాదాలు తెలుపుతారు ప్రధాని...

టోక్యో ఒలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో భారత్ నుంచి 127 మంది అథ్లెట్లు పాల్గొనగా, ఇప్పటికి రెండు పతకాలు లభించాయి. అయితే గత ఒలింపిక్స్‌తో పోలిస్తే హాకీ, టేబుల్ టెన్నిస్, ఫెన్సింగ్, టెన్నిస్, ఈక్వెస్ట్రేయిన్ వంటి ఈవెంట్లలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది భారత్... 

Follow Us:
Download App:
  • android
  • ios