సౌతాంప్టన్ వేదికగా జరిగిన వన్డేలో ఇంగ్లాండ్ మహిళల జట్టుపై భారత్ అద్భుత విజయం సాధించింది. లక్ష్యంగా విధించిన 259 పరుగులను టీమిండియా 10 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

INDW vs ENGW : భారతీయ క్రికెటర్లంతా ప్రస్తుతం ఇంగ్లాండ్ లోనే ఉన్నారు... మెన్స్ టీం టెస్ట్ సీరిస్ ఆడుతుండగా ఉమెన్స్ టీం వన్డే సీరిస్ ఆడుతుంది. ఇలా సౌతాంప్టన్ లో జరిగిన వన్డేలో మన అమ్మాయిలు అదరగొట్టారు. ఆతిథ్య ఇంగ్లాండ్ టీం విసిరిన 259 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించారు... మరో పది బంతులు మిగిలుండగానే విజయం సాధించింది టీమిండియా.

లక్ష్యచేధనలో ఇండియన్ ఆల్రౌండర్ దీప్తి శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడారు. బౌలింగ్ లో పెద్దగా రాణించకున్నా బ్యాట్ తో మాత్రం అదరగొట్టి హాఫ్ సెంచరీ (62 పరుగులు నాటౌట్) సాధించారు. చివరివరకు క్రీజులో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇలా టీమిండియా గెలుపులో కీలకంగా వ్యవహరించిన దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ గా నిలిచారు.

Scroll to load tweet…

ఇండియా లక్ష్యచేధన సాగిందిలా..

ఇంగ్లాండ్ ఉమెన్స్ టీం మొదట బ్యాటింగ్ చేసి ఆరు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్లను అతి తక్కువ పరుగులకే కట్టడిచేసినా మిడిల్ ఆర్డర్ బ్యాట్ ఉమెన్స్ బాగా ఆడారు. ఎమ్మా లాంబ్ 39, కెప్టెన్ నట్ సివర్ బ్రట్ 41, సోఫియా డుంక్లె 83, రిచర్డ్స్ 53 పరుగులతో రాణిచారు... దీంతో ఇంగ్లాండ్ టీం భారత్ ముందు 259 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.

లక్ష్యచేధనలో భారత్ కు శుభారంభం లభించింది. ఓపెనర్లు ప్రతీక రావల్ 36, స్మృతి మందాన 28 పరుగులతో అదరగొట్టారు. మిడిల్ ఆర్డర్ లో హర్లీన్ డియోల్ 27, జమ్మిమా రోడ్రిగ్స్ 48, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 17, అమర్జోత్ కౌర్ 20 పరుగులు చేశారు. దీప్తి శర్మ మాత్రం మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్ ఆడారు... చివరివరకు క్రీజులో నిలబడి కేవలం 64 బంతుల్లోనే 62 పరుగులు చేశారు. ఇలా ఆమె దగ్గరుండి మరీ భారత జట్టును విజయతీరాలకు చేర్చారు.

భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ 2, స్నేహ రానా 2, అమర్జీత్ కౌర్ 1, శ్రీ చరణ్ 1 వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లూరెన్ బెల్ 1, సోఫి ఎక్లెస్టోన్ 1, లూరెన్ ఫీలర్ 1, చార్లోట్ డెన్ 2 వికెట్లు తీశారు.