ఆసియా కప్ ను సాధించి పెట్టిన రోహిత్ శర్మను ఈ నెల 4వ తేదీ నుంచి స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్ కు ఎంపిక చేయలేదు. ఆయనను పక్కన పెట్టి యువ క్రీడాకారులు పృథ్వీ షా, మాయాంక్ అగర్వాల్, హనుమ విహారీలకు స్థానం కల్పించారు.
ముంబై: వెస్టిండీస్ జట్టుతో జరిగే రెండు మ్యాచుల సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో రోహిత్ శర్మకు స్థానం కల్పించకపోవడంపై తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. రోహిత్ శర్మను పక్కన పెట్టడంపై ఇప్పటికే భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఆసియా కప్ ను సాధించి పెట్టిన రోహిత్ శర్మను ఈ నెల 4వ తేదీ నుంచి స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్ కు ఎంపిక చేయలేదు. ఆయనను పక్కన పెట్టి యువ క్రీడాకారులు పృథ్వీ షా, మాయాంక్ అగర్వాల్, హనుమ విహారీలకు స్థానం కల్పించారు. రోహిత్ శర్మను పక్కన పెట్టడాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని హర్భజన్ వ్యాఖ్యానించాడు. ట్వీట్టర్ వేదికగా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
రోహిత్ శర్మను పక్కన పెట్టడంపై అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ట్విట్టర్ వేదికగా వారు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాఫ్రికతో జరిగిన సిరీస్ లో కెఎల్ రాహుల్, పుజారా వంటి అందరు క్రీడాకారుల మాదిరిగానే రోహిత్ శర్మ కూడా విఫలమయ్యాడని అన్నారు.
సంబంధిత వార్తలు
వెస్టిండీస్ తో టెస్టు సిరీస్: రోహిత్ కు మళ్లీ చేయి, ధావన్ ఔట్
