రెండో టెస్టుకి జట్టు ఖరారు.. విహారికి దక్కని చోటు

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 11, Oct 2018, 2:33 PM IST
India vs West Indies:  Vihari and  Mayank Agarwal's name missing as BCCI announces 12-man squad for second Test
Highlights

మొదటి టెస్టులో చెలరేగి పోయి ఆడిన విహారి.. రెండో టెస్టులోనూ చోటు దక్కుతుందని భావించాడు. 

హైదరాబాద్ వేదికగా భారత్-విండీస్ ల మధ్య జరగనున్న రెండో టెస్టుకి జట్టుని ఎంపిక చేశారు.  అయితే.. ఈ జుట్టులో తెలుగు కుర్రాడు హనుమ విహారికి చోటు దక్కకపోవడం గమనార్హం. అరంగేట్ర టెస్టులో తన సత్తాచాటాడు హనుమ  విహారి. మొదటి టెస్టులో చెలరేగి పోయి ఆడిన విహారి.. రెండో టెస్టులోనూ చోటు దక్కుతుందని భావించాడు. 

కానీ.. అతని ఆశలు అడిశలయ్యాయి. విహారీ మాత్రమే కాదు.. మయాంక్ అగర్వాల్ కి కూడా చోటు దక్కకపోవడం గమనార్హం. మొదటి టెస్టులో భాగంగా జట్టును ఎంపిక చేసినప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సెలక్టర్లు.. అజింక్య రహానేను జట్టులో కొనసాగించారు. ఇక మొదటి టెస్టులో తమ ప్రతాపం చూపించిన రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్ షమిలను జట్టులో కొనసాగించారు. శార్దూల్‌ ఠాకూర్‌ను బౌలింగ్‌ ఆప్షన్‌గా ఎంచుకున్నారు. మహ్మద్‌ సిరాజ్‌కు ఎదురుచూపులు తప్పలేదు.

టీమిండియా జట్టిదే: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, పృథ్వీషా, చతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే, రిషబ్‌ పంత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌.

loader