టీం ఇండియా వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ కి కోపం వచ్చింది. ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనిపై రోహిత్ మండిపడ్డాడు. కొంచెం బ్రెయిన్ వాడు అంటూ మైదానంలోనే ఫైర్ అయ్యాడు. కాగా.... దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఇంతకీ మ్యాటరేంటంటే... ఇటీవల టీం ఇండియా దక్షిణాఫ్రికాతో టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ కోసం తలపడిన సంగతి తెలిసిందే. కాగా... ఈసిరీస్ మొత్తం డ్రాగా నిలిచింది. అయితే... మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో నవదీప్ ఆటతీరుపై రోహిత్ శర్మకి బాగా కోపం వచ్చేసింది. ఆదివారం బెంగళూరు వేదికగా చినస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్  జరగింది.

దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 12వ ఓవర్ లో నవదీప్ సైనీ బౌలింగ్ చేస్తున్నాడు. కాగా... నవదీప్ బౌలింగ్ దక్షిణాఫ్రికా క్రికెటర్ చెలరేగిపోయాడు. నవదీప్ వేసిన రెండు బాల్స్ వెంట వెంటనే బౌండరీని తాకాయి. దీంతో... రోహిత్ కి విపరీతంగా కోపం వచ్చేసింది. వెంటనే నవదీప్ ని ఉద్దేశించి కొంచెం బ్రెయిన్ వాడు అంటూ చేతితో సైగలు చేస్తూ  సీరియస్ అయ్యాడు. కాగా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

కాగా.. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించగా... మొత్తంగా సిరీస్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్ ఒక్కడే డబల్ డిజిట్ స్కోర్ చేయగా.... విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇతర క్రికెటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం గమనార్హం.