సమరానికి సిద్ధమైన భారత్-పాక్.. సెప్టెంబర్ 19న దాయాదుల పోరు

india vs pakistan match held at september 2018
Highlights

అబుదాబి, దుబాచ్ ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియాకప్ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. సెప్టెంబర్ 19న పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది

క్రికెట్‌లో అసలు సిసలు మజాను ఆస్వాదించాలంటే కొన్ని దేశాల మధ్య జరిగే మ్యాచ్‌లు చూడాల్సిందే. వాటిలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ ప్రపంచం చూపు మొత్తం అటువైపే ఉంటుంది.  బాల్ టూ బాల్ నరాల తెగే ఉత్కంఠ మధ్య సాగుతుంది. గతేడాది జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇరు దేశాలు మళ్లీ తలపడలేదు. సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు నిర్వహించడానికి భారత ప్రభుత్వం బీసీసీఐకి అనుమతి నిరాకరించింది.

ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు ఊసురుమన్నారు. ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించాలని ప్రయత్నించిన్పటికీ కేంద్రప్రభుత్వం ససేమీరా అంది. అయితే తిరిగి అభిమానుల కోరిక తీర్చేందుకు ఆసియా కప్ వేదికయ్యింది. అబుదాబి, దుబాచ్ ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియాకప్ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది.

సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ తలపడుతుండగా.. మరోస్థానం కోసం యూఏఈ, సింగపూర్, ఒమన్, నేపాల్, మలేసియా, హంకాంగ్‌లు పోటీపడనున్నాయి. పాకిస్తాన్, క్వాలిఫయిర్, భారత్ గ్రూప్-ఎ లో ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లు గ్రూప్-బి లో ఉన్నాయి.  సెప్టెంబర్‌ 18న భారత్, క్వాలిఫయిర్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం సెప్టెంబర్ 19న పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. సెప్టెంబర్ 28న దుబాయ్‌లో ఫైనల్ జరుగుతుంది. 
 

loader