మరో ఘనత సాధించిన విరాట్ కోహ్లీ

First Published 17, Jul 2018, 9:22 PM IST
India vs England: Virat Kohli sets new record
Highlights

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వన్డేల్లో మూడు వేల పరుగులు  సాధించిన కెప్టెన్‌గా అతను ఘతన సాధించాడు.

లీడ్స్‌: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వన్డేల్లో మూడు వేల పరుగులు  సాధించిన కెప్టెన్‌గా అతను ఘతన సాధించాడు. ఒక జట్టు కెప్టెన్‌గా కోహ్లి కేవలం 49 ఇన్నింగ్స్‌ల్లోనే వన్డే ఫార్మాట్ లో మూడు వేల పరుగుల మార్కును సాధించాడు 

ఇంగ్లాండ్‌తో  చివరిదీ మూడోది అయిన వన్డేలో కోహ్లీ బుధవారం ఈ రికార్డు నమోదు చేశాడు. ఒక కెప్టెన్‌గా వన్డేల్లో మూడు వేల పరుగుల సాధించడానికి అతి తక్కువ ఇన్నింగ్స్‌లు ఆడిన వారిలో విరాట్‌ కోహ్లి తర్వాత స్థానంలో ఏబీ డివిలియర్స్‌ ఉన్నాడు. 

ఈ  ఫీట్‌ను ఏబీ డివిలియర్స్‌ సాధించడానికి 60 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఎంఎస్‌ ధోని(70 ఇన్నింగ్స్‌లు), సౌరవ్‌ గంగూలీ(74 ఇన్నింగ్స్‌లు), గ్రేమ్‌ స్మిత్‌-మిస్బావుల్‌ హక్‌(83 ఇన్నింగ్స్‌లు), జయసూర్య,పాంటింగ్‌(84 ఇన్నింగ్స్‌లు) వరుస స్థానాల్లో ఉన్నారు. 

loader