విశాఖపట్నం: తొలి ట్వంటీ మ్యాచులో ఆస్ట్రేలియా భారత్ పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఆడి ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. చివరి బంతి వరకు మ్యాచ్ రోమాంచితంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. బారత బౌలర్లలో బుమ్రాకు మూడు వికెట్లు దక్కగా, చాహల్, కృణాల్ పాండ్యా చెరో వికెట్ తీశారు.

భారత్ తో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచులో ఆస్ట్రేలియా 113 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. నైల్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.101 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ షార్ట్స్ 37 బంతుల్లో 37 పరుగులు చేసి రన్నవుట్ అయ్యాడు. 102 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. టర్నర్ పాండ్యా బౌలింగులో డకౌట్ అయ్యాడు.113 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. హ్యాండ్స్ కోంబ్ బుమ్రా బౌలింగులో అవుటయ్యాడు.

ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినప్పటికీ ఆ తర్వాత పుంజుకుంది. ఐదు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. స్టోయినిస్ 1 పరుగు మాత్రమే చేసి రన్నవుట్ కాగా, ఫించ్ బుమ్రా బౌలింగులో డకౌట్ అయ్యాడు. 89 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 43 బంతుల్లో 56 పరుగులు చేసి మాక్స్ వెల్ చాహల్ బౌలింగులో అవుటయ్యాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ20 మ్యాచులో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ధోనీ 29 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. నాలుగు బంతులు ఆడి పరుగులేమీ చేయకుండా చాహల్ నాటౌట్ గా మిగిలాడు.అంతకు ముందు 109 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. ఉమేష్ యాదవ్ 2 పరుగులు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగులో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

వంద పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. కెఎల్ రాహుల్ అర్థ సెంచరీ చేసి పెవిలియన్ దారి పట్టాడు. దినేష్ కార్తిక్, కృణాల్ పాండ్యా ఒక్కటేసి పరుగులు మాత్రమే చేసి నీల్ బౌలింగులో అవుటయ్యారు.

ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ20 తొలి మ్యాచులో భారత్ కు దెబ్బ మీద దెబ్బ మీద పడుతోంది. 69 పరుగుల స్కోరు వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 24 పరుగులు చేసి అవుటయ్యాడు. 80 పరుగుల స్కోరు వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. రిషబ్ పంత్ కేవలం 3 పరుగులు చేసి రన్నవుట్ అయ్యాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచులో భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.14 పరుగుల స్కోరు వద్ద రోహిత్ శర్మ తొలి వికెట్ గా వెనుదిరిగాడు. కేవలం ఐదు పరుగులు చేసి, బెహ్రాండార్ఫ్ బౌలింగులో జంపాకు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ అవుటయ్యాడు.

రెండు ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచుల సిరీస్ లో భాగంగా ఆదివారం సాయంత్రం టాస్ గెలిచి భారత్ పై ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టులో విజయ శంకర్ మిస్సయ్యాడు.

జట్లు

ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డీ ఆర్సీ షార్ట్, మార్కుస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్ వెల్, పీటర్ హ్యాండ్స్ కోంబ్ (వికెట్ కీపర్), ఆస్తోన్ టర్నర్, నాథన్ కౌల్టర్ నీలే, పాట్ కమిన్స్, రిచర్డ్సన్, జాసోన్ బెహ్రాండార్ఫ్, ఆడం జంపా

ఇండియా: రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషబ్ పంత్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దినేష్ కార్తిక్, కృణాల్ పాండ్యా, ఉమేష్ యాదవ్, మాయాంక్ మార్కండే, యజుర్వేంద్ర చాహల్, జస్ ప్రీత్ బుమ్రా