వెస్టిండిస్తో జట్టుతో స్వదేశంలో జరుగుతున్న వన్డే సీరిస్‌ను టీంఇండియా ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. వెస్టిండిస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేదించడంలో కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు చెలరేగి సెంచరీలు చేయడంతో భారత్ సునాయాసంగా విజయ  తీరాలకు చేరింది. దీంతో తర్వాత విశాఖలో జరిగే సెకండ్ వన్డే కోసం రెట్టించిన ఉత్సాహంతో భారత ఆటగాళ్లు భరిలోకి దిగుతున్నారు.

గతకొంతకాలంగా మ్యాచ్‌కు ఒకరోజు ముందే జట్టు సభ్యులను ప్రకటిస్తోంది బిసిసిఐ. ఇలా రేపు( 24 అక్టోబర్) వైజాగ్ లో జరగనున్న వన్డేలో బరిలోకి దిగనున్న ఆటగాళ్లను ప్రకటించింది బిసిసిఐ. ఈ వన్డేలో ఆడే 12 మంది ఆటగాళ్ల పేర్లను టీం మేపేజ్‌మెంట్ బిసిసిఐ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 

 విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, అంబటి రాయుడు, రిషభ్‌ పంత్‌, ఎంఎస్‌ ధోని, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చహల్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, ఖలీల్‌ అహ్మద్‌లతో కూడిన జట్టు  రేపు వెస్టిండీస్‌తో వైజాగ్‌ వేధికగా ఢీకొంటుంది.  దాదాపు తొలి వన్డేలో ఆడిన ఆటగాళ్లనే ప్రకటించిన మేనేజ్‌మెంట్‌ ఒకే ఒక మార్పు చేసింది. కొత్తగా కుల్దీప్‌ యాదవ్ పేరును చేర్చింది. అయితే తుది జట్టులో స్థానం లభిస్తుందా? లేదా 12వ ఆటగాడిగా బెంచ్ కే పరిమితమవుతాడా అన్నది బుధవారమే తేలనుంది.