Hockey : పారిస్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచే ఛాన్స్ మిస్సైన భారత్..
Indian Hockey Team : పారిస్ ఒలింపిక్స్ పరుషుల హాకీ సెమీ ఫైనల్ పోరులో భారత్-జర్మనీలు గెలుపుకోసం అద్భుతంగా పోరాడాయి. భారత అద్భుత ప్రదర్శన చేసింది కానీ, చివరి క్వార్టర్ లో జర్మనీ దూకుడు ఆటతో భారత్ 2-3 తేడాతో ఓడిపోయింది.
Indian Hockey Team : భారత జట్టు 44 ఏండ్ల కల చెదిరిపోయింది. పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రయాణంతో ముందుకుసాగిన భారత హాకీ జట్టు చాలా కాలం తర్వాత స్వర్ణం సాధించాలన్న కల కలగానే మిగిలింది. సెమీ ఫైనల్‌లో జర్మనీ జట్టు చేతిలో 3-2 తేడాతో ఓడిపోయింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో టీమిండియా జర్మనీని ఓడించింది. ఆ ఓటమికి జర్మనీ జట్టు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది. దాదాపు గోల్డ్ మెడల్ గెలవడానికి దగ్గరగా వచ్చిన భారత్ రెండు అడుగుల దూరంలో ఆగిపోయింది. అయితే, ఆగస్టు 8న కాంస్య పతక పోరులో స్పెయిన్ తో తలపడనుంది. భారత్ ను ఓడించిన జర్మనీ జట్టు ఫైనల్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది.
మ్యాచ్ 7వ నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ భారత్‌కు తొలి గోల్ తో శుభారంభం చేశాడు. 18వ నిమిషంలో జర్మనీకి చెందిన గొంజలో పిలాట్ గోల్ చేసి సమం చేశాడు. 27వ నిమిషంలో క్రిస్టోఫర్ రూర్ గోల్ చేసి జర్మనీకి అధిక్యం అందించాడు. 36వ నిమిషంలో సుఖ్‌జిత్ సింగ్ టీమ్ ఇండియాకు గోల్ చేయడంతో ఇరు జట్లు సమంగా నిలిచాయి. 54వ నిమిషంలో మార్కో మిల్ట్‌కౌ గోల్ చేసి జర్మనీని ముందుంచాడు. మ్యాచ్ ముగియడానికి 6 నిమిషాల ముందు అతని గోల్ నిర్ణయాత్మకంగా మారింది.
తొలి క్వార్టర్‌లో భారత్ తొలి గోల్.. ఆ తర్వాత పుంజుకున్న జర్మనీ
తొలి క్వార్టర్ ప్రారంభంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. దీంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేయలేకపోయాడు. హర్మన్‌ప్రీత్ కొట్టిన షాట్‌ను జర్మనీ గోల్‌కీపర్ ఆపాడు. ఇది జరిగిన వెంటనే మరుసటి నిమిషంలో భారత్‌కు రెండో పెనాల్టీ కార్నర్ లభించింది. వరుసగా రెండు పెనాల్టీ కార్నర్‌లను టీమిండియా కోల్పోయింది. ఏడో నిమిషంలో హర్మన్ ప్రీత్ సింగ్ భారత్‌కు పెనాల్టీ కార్నర్‌లో అద్భుతమైన గోల్ చేశాడు. రెండో క్వార్టర్‌లో జర్మనీ అద్భుత ఆటతో రాణించి రెండు గోల్స్ చేసింది. 18వ నిమిషంలో గొంజాలో పిలాట్ గోల్, దీని తర్వాత 27వ నిమిషంలో క్రిస్టోఫర్ రూర్ రెండో గోల్ చేశాడు. జర్మనీప్రీత్ సింగ్ తప్పిదంతో జర్మనీకి పెనాల్టీ స్ట్రోక్ వచ్చింది. దీనిపై క్రిస్టోఫర్ గోల్ సాధించాడు. మూడో క్వార్టర్ ప్రారంభంలో భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. రెండు సార్లు గోల్స్ చేయడంలో భారత్ విజయం సాధించలేదు. జర్మన్ గోల్ కీపర్ షాట్ ఆపాడు. అనంతరం 36వ నిమిషంలో సుఖ్‌జిత్ సింగ్ అద్భుత గోల్ చేసి భారత్ ను సమంగా నిలబెట్టాడు. అయితే, 54వ నిమిషంలో మార్కో మిల్ట్‌కౌ గోల్ చేసి జర్మనీని ముందుంచాడు.