ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సీరీస్ లో భారత జట్టు ఎట్టకేలకు పుంజుకుంది. వరుసగా రెండు టెస్ట్ లలో ఘోర పరాభవాన్ని చవిచూసిన టీ ఇండియా మూడో టెస్ట్ లో అద్భుతంగా ఆడి విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంలో భారత జట్టు అటు బ్యాంటింగ్ ఇటు బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి ఈ విజయాన్ని కైవసం చేసుకుంది. దీంతో కోహ్లీ సేన నిన్న(గురువారం) మొదలైన నాలుగో టెస్ట్ ను రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభించింది. ఈ టెస్ట్ లో కోహ్లీ కెప్టెన్సీలో ఇప్పటివరకు చేయని ప్రయోగం చేసి మంచి ఫలితాన్ని సాధించారు.

కోహ్లీ ఇప్పటివరకు టీం ఇండియా ఆడిన 38 టెస్ట్ మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించారు. అయితే అతడు ఆడిన ఏ  టెస్ట్ మ్యాచ్ లోనూ టీంలో కనీసం ఒక్కటైనా మార్పుండేది. కానీ ఈ టెస్ట్ లో మాత్రం ఒక్క మార్పు కూడా లేకుండానే బరిలోకి దిగింది. మోడో టెస్ట్ లో ప్రతి ఒక్కరు చక్కటి ఆటతీరుతో భారత విజయంలో పాలుపంచుకోవడంతో అదే జట్టును కొనసాగించాలని టీం మేనేజ్ మెంట్ భావించింది. ఈ కొత్త ప్రయోగం ఇప్పటికైతే మంచి ఫలితాన్నిచ్చింది. 

 ఆలా మూడో  టెస్ట్ లో ఆడిన జట్టునే నాలుగో టెస్ట్ లో యదావిధిగా కొనసాగించిన ప్రభావం మొదటిరోజు మ్యాచ్ లోనే కనిపించింది. ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నా బారత బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయింది. దీంతో కేవలం 246 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యింది. అయితే టీం ఇండియా గురువారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది.  

ఇలా కోహ్లీ తన కెప్టెన్సీ కెరీర్ లో కొత్త ప్రయోగాన్ని చేసి మంచి పలితాన్ని పొందుతుండటంతో అతడిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. అయితే ఈ ప్రయోగం పూర్తిగా ఫలించిందో లేదో తెలియాలంటే ఈ నాలుగో టెస్ట్ మ్యాచ్ ముగిసే వరకు వేచిచూడాల్సిందే.

సంబంధిత వార్తల కోసం కింది లింక్స్ క్లిక్ చేయండి

ఆదుకున్న కరాన్: 246 పరుగులకు ఇంగ్లాండు ఆలౌట్