దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో 120 బంతుల్లో 81 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్‌ అక్షర్ పటేల్ అవుట్ చేశాడు.

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన సహచరుడు, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్.. కేన్ విలియమ్సన్ వికెట్ తీయడంతో సరదాగా అతని కాళ్లు తాకాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో ఇది జరిగింది.

గ్రూప్ దశలో ఓటమి లేకుండా టీమిండియా గ్రూప్ A పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 249/9 స్కోరు చేసిన తర్వాత, భారత బౌలర్లు కివీస్‌ను 45.3 ఓవర్లలో 205 పరుగులకు కట్టడి చేశారు. అయితే, ఒకానొక సమయంలో కేన్ విలియమ్సన్ బ్యాట్‌తో నిలబడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతుండటంతో భారత్ గెలవడం కష్టమనిపించింది. 

న్యూజిలాండ్ 17/1 వద్ద రచిన్ రవీంద్ర వికెట్ కోల్పోయిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విలియమ్సన్ జట్టును నడిపించాడు. కివీస్ రెగ్యులర్‌గా వికెట్లు కోల్పోయినా, అతను మాత్రం క్రీజులో నిలబడి జట్టుకు అండగా ఉన్నాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుటయ్యే వరకు కేన్ విలియమ్సన్ మంచి టచ్‌లో కనిపించాడు. అక్షర్ పటేల్ స్పిన్ బౌలింగ్‌లో విలియమ్సన్ కాలు క్రీజు దాటడంతో కేఎల్ రాహుల్ స్టంపింగ్ చేశాడు. అతను 120 బంతుల్లో 81 పరుగులు చేసి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాడు. 

కేన్ విలియమ్సన్ వికెట్ చాలా కీలకం కావడంతో భారత ఆటగాళ్లలో ఆనందం వెల్లివిరిసింది. విరాట్ కోహ్లీ సరదాగా అక్షర్ పటేల్ దగ్గరికి వెళ్లి అతని కాళ్లు తాకాడు. కానీ అక్షర్ వద్దని వారించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

చూడండి: విరాట్ కోహ్లీ అక్షర్ పటేల్ కాళ్లు తాకడం 

Scroll to load tweet…
Scroll to load tweet…

కేన్ విలియమ్సన్ 169/7 వద్ద అవుటైన తర్వాత, న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 31 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత 196/8 వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ చివరి రెండు వికెట్లను 9 పరుగులకే కోల్పోయి 4.3 ఓవర్లు మిగిలి ఉండగానే 205 పరుగులకు ఆలౌటైంది. 

భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 42 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు.