విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో ఔటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఓటమి ఎఫెక్ట్.. ఎక్కువ టీం ఇండియా పేసర్ ఉమేష్ యాదవ్ పై పడింది. మ్యాచ్ ఓడిపోవడానికి ఉమేష్ కారణం అంటూ.. నెటిజన్లు మండిపడుతున్నారు.

టీం ఇండియా నిర్దేషించిన 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన  ఆసీస్ చివరి ఓవర్లో 14 పరగులు చేయాల్సి వచ్చింది. ఆ ఓవర్ లో ఉమేష్ యాదవ్ బౌలింగ్ చేస్తున్నాడు. కాగా.. ఉమేష్ యాదవ్ చేసిన బౌలింగ్ ఆసిస్ క్రికెటర్ సమర్థవంతంగా వినియోగించుకున్నాడు. రెండు ఫోర్స్ కొట్టి విజయ దిశగా మ్యాచ్ ని నడిపించాడు. అప్పటి వరకు బుమ్రా పడిన కష్టాన్ని ఉమేష్ నాశనం చేశాడు. దీంతో.. అభిమానులు ఉమేష్ పై మండిపడుతున్నారు.

భారత ఓటమికి ఉమేశే కారణమని, టీ20ల్లో.. అది చివరి ఓవర్లలో ఎలా బౌలింగ్‌ చేయాలో కూడా తెలియదా? అంటూ మండిపడుతున్నారు. తమ ఎడిటింగ్‌ నైపుణ్యానికి పనిచెప్పి మరి ఫన్నీ మీమ్స్‌ ట్రెండ్‌ చేస్తున్నారు. టీం ఇండియాకి ఉమేష్ పెద్ద విలన్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.