నిన్న జరిగిన ఐపీఎల్ వేలంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవరూ ఊహించని విధంగా కొందరు అమ్ముడుపోతే... ఇంకొందరేమో అంచనాలను తలక్రిందులుగా చేస్తూ కొందరేమో అమ్ముడవకుండా మిగిలిపోయారు. 
ఈనేపథ్యంలో ఈ ఐపీఎల్ వేలంలో హిట్ షోస్ ఎవరివి ప్లాప్ షోస్ ఎవరివో చూద్దాం.  


ప్లాప్స్... 

కోలిన్ డి గ్రాండ్‌హోమ్

బేస్ ప్రైస్: 75 లక్షలు

అన్ని ఫార్మాట్లలోను  తానొక విలువైన అల్ రౌండర్ అని నిరూపించుకున్న ఈ కివీస్ ప్లేయర్ కి నిరాశే మిగిలింది. నిన్న ఇతగాడి పేరును మూడుసార్లు పిలిచినప్పటికీ, అతని పట్ల ఏ ఒక్క టీం కూడా ఆసక్తిని కనబరచలేదు. 

కోలిన్ మన్రో

బేస్ ప్రైస్: 1 కోటి

రోహిత్ శర్మతో సమానంగా టి 20లలో మూడు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్ మన్ ఇతడే. కాని నిరుడు ఢిల్లీ క్యాపిటల్స్  తో వైఫల్యం చెందడం వల్ల ఈ సీజన్ లో ఈ కివిస్ బిగ్ హిట్టర్  ఐపిఎల్ బెర్తును కోల్పోయాడు.

కేస్రిక్ విలియమ్స్

బేస్ ప్రైస్: 50 లక్షలు

గత వారం విరాట్ కోహ్లీ నోట్ బుక్ పంచ్ వల్ల బాగా పాపులర్ అయినఅప్పటికి ఇతగాడిని కొనుగోలు చేయడానికి ఏ ఒక్క టీం కూడా ముందుకు రాలేదు.  విలియమ్స్ తనను తాను టి 20 స్పెషలిస్ట్ పేసర్‌గా నిరూపించుకున్నప్పటికీ కూడా, ఫ్రాంఛైజీలందరూ ఇతగాడిని పట్టించుకోలేదు. ఇతర పేసర్ల మీద డబ్బును కురిపించినప్పటికీ ఇతనిని మాత్రం విస్మరించారు. 

also read ఫించ్! కోహ్లీ నిన్ను ఇష్టపడడా: పైన్, వీడియో వైరల్

అల్జారీ జోసెఫ్

బేస్ ప్రైస్: 50 లక్షలు

గత ఏడాది ఆడమ్ మిల్నే గాయం కారణంగా వైదొలగడంతో ముంబై ఇండియన్స్ తరుఫున అలీజారి జోసెఫ్ ఆరంగ్రేటం చేసాడు. తొలి మ్యాచులోనే సన్ రైజర్స్ పై అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసి రికార్డు నెలకొల్పాడు. ఇతని 6/12 ఇప్పటికి ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.  కొద్ది కాలం గాయం కారణంగా టీం కి దూరమైనా ఇప్పుడు విండీస్ తరుఫున ఒక ప్రభావశీల బౌలర్ గా ఇతను కొనసాగుతున్నాడు. ఈ పేసర్ ని ఏ టీం కూడా ఎందుకు దక్కించుకోలేదో మాత్రం ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న. 
ఇక నిన్న హిట్ బిడ్స్ విషయానికి వస్తే మాత్రం చాలానే ఉన్నాయి. ఈ హిట్ లిస్ట్ లో దేశీయ ప్లేయర్లకన్నా విదేశీ ప్లేయర్లే ఎక్కువగా ఉన్నారు. 

హిట్స్:

షెల్డన్ కాట్రెల్

బేస్ ప్రైస్: 50 లక్షలు

విన్నింగ్ బిడ్: రూ. 8.5 కోట్లు (కింగ్స్ ఎలెవన్ పంజాబ్)

షెల్డన్ కాట్రెల్... ఈ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఇతడి సెల్యూట్. వికెట్ తీయగానే ఇతని సెల్యూట్ ఇతని ట్రేడ్ మార్క్ స్టైల్ అయిపోయింది. షెల్డన్ కాట్రెల్ ని ముద్దుగా చాలా మంది  సెల్యూట్ కాట్రెల్ గా పిలుచుకుంటున్నారు కూడా. 
కేవలం సెల్యూట్లకు మాత్రమే పరిమితం కాకుండా ఒక మంచి ఎడమ చేతి వాటం పేసర్ గా తనని తాను నిరూపించుకున్నాడు.

నాణ్యమైన బౌలింగ్ వేస్తూ ఆఫ్ కట్టర్లను సాధించడంలో ఆరితేరాడు. ఈ నాణ్యమైన బౌలేరని దక్కించుకోవడానికి కింగ్స్ ఎలెవన్  పంజాబ్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తుదికంటా ప్రయత్నించింది. కానీ ఢిల్లీ కన్నా ఎక్కువ రేటు చెల్లించి పంజాబ్ ఇతన్ని దక్కించుకుంది. కలలో కూడా తాను ఇంత రేటు పలుకుతానని ఊహించి ఉండడు. 

నాథన్ కౌల్టర్ నైల్ 

బేస్ ప్రైస్: 1 కోటి

విన్నింగ్ బిడ్: రూ. 8 కోట్లు (ముంబై ఇండియన్స్)

వైట్-బాల్ ఫార్మాట్లలో బంతితో తానేమిటో ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న ప్లేయర్ ఆస్ట్రేలియన్ ప్లేయర్. తన బేస్ ప్రైస్ కన్నా ఎనిమిది రేట్లు ఎక్కువకు అమ్ముడవడం...తిరిగి ముంబై ఇండియన్స్ టీంలోకి రావడం ఇతగాడి ఆనందాన్ని రెండింతలు చేస్తున్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య నువ్వానేనా అన్న రీతిలో ఈ ఫాస్ట్ బౌలర్ కోసం బిడ్డింగ్ జరిగింది. చివరాఖరకు చెన్నై కన్నా ఎక్కువ డబ్బులు వెచ్చించి ముంబై ఇతడ్ని ఎగరేసుకు పోయింది. 

also read ipl Auction: ఐపీఎల్ వేలంలో ఏ ప్లేయర్ను ఏ టీం దక్కించుకుందంటే!

క్రిస్ మోరిస్

బేస్ ప్రైస్:1.5 కోట్లు

విన్నింగ్ బిడ్: రూ. 10 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

టీంలు ప్లేయర్లను రిలీజ్ చేయడం కొన్నిసార్లు వారికి అనుకూలంగా పనిచేస్తుంది. క్రిస్ మోరిస్ విషయంలో ఇదే జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సఫారీ అల్ రౌండర్ ని రిలేస్ చేసింది. అనూహ్యంగా ఇతడ్ని దక్కించుకోవడానికి తీవ్రమైన పోటీ నెలకొంది. బౌలింగ్ విభాగంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆర్సీబీ జట్టు ఇతడ్ని 10 కోట్లు వెచ్చించి మరి కొనుగోలు చేసింది. 

వరుణ్ చక్రవర్తి

బేస్ ప్రైస్: 30 లక్షలు

విన్నింగ్ బిడ్: రూ. 4 కోట్లు (కోల్‌కతా నైట్ రైడర్స్)

గత ఏడాది ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా ధరపలికిన భారతీయు ప్లేయర్ గా అవతరించినప్పటికీ, చెన్నైకి చెందిన మిస్టరీ స్పిన్నర్ ఐపీఎల్ 2019 లో పెద్ద ప్రభావం చూపెట్టలేకపోయాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ టీంలో ఇతని ప్రదర్శన అంత గొప్పగా మాత్రం లేదు. 

అయినప్పటికీ, ఒకసారి అతను తిరిగి వేలంలోకి రాగానే, నైట్ రైడర్స్ అతగాడిని ఎలాగైనా దక్కించుకోవాలని చూసింది..దక్కించుకుంది కూడా. గత పర్యాయం నైట్ రైడర్స్, పంజాబ్ ల మధ్య ఈ మిస్టరీ స్పిన్నర్ కోసం నువ్వానేనా అన్నట్టు పోటీ జరిగింది. ఈ సరి కేకేఆర్ ఎలాగైనా గత పర్యాయం మిస్ అయ్యాడు కాబట్టి అతడ్ని దక్కించుకోవాలని డిసైడ్ అయినట్టుంది. ఆర్సీబీతో నువ్వానేనా అన్న రీతిలో జరిగిన బిడ్డింగ్ లో కేకేఆర్ వరుణ్ చక్రవర్తిని దక్కించుకుంది.