హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కొనుగోలు చేసింది. ఆయనను ఆర్సీబీ రూ.4.4 కోట్లకు సొంతం చేసుకుంది. ఫించ్ ఆర్సీబీ జట్టుకు వెళ్లడంపై క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. 

ఆసీస్ స్టార్ ఆటగాడు ఫించ్ ఆర్సీబీకి వెళ్లాడని, జట్టు సభ్యులు అతన్ని ఇష్టపడుతారని ఆశిస్తున్నామని అంటూ సీఎ ఓ వీడియోను పోస్టు చేశింది. ఇందులో ఫించ్, టిమ్ పైన్ సరదాగా మాట్లాడుకున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అనే విషయం తెలిసిందే.

Also Read: ముందే కూసిన శ్రేయాస్ అయ్యర్: కోహ్లీ రియాక్షన్, వీడియో వైరల్

ఆస్ట్రేలియా, భారత్ మధ్య గతంలో జరిగిన మ్యాచ్ సందర్బంగా రోహిత్ శర్మ దృష్టిని మళ్లించడానికి పైన్ తో ఫించ్ ఓ కామెంట్ చేశాడు. "ఫించ్... ఐపిఎల్ లో నువ్వు ఎన్నో జట్లు మారావు. ప్రతి జట్టులో ఆడావు" అని పైన్ అన్నాడు. "ఒక్క బెంగళూర్ కు తప్ప" అని ఫించ్ చెప్పాడు. 

"వాళ్లు నిన్ను ఎందుకు తీసుకోలేదు. కోహ్లీ నిన్ను ఇష్టపడడా" అని పైన్ అన్నాడు. "నన్ను ఎవరూ ఇష్టపడరు. అందుకే అన్ని జట్లు మారాను" అని ఫించ్ జవాబిచ్చాడు. ఫించ్ ఆర్సీబీ కొనుగోలు చేయడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.