Asianet News TeluguAsianet News Telugu

ఇఫ్తార్ వర్సెస్ ఫుట్‌బాల్..!

ఇఫ్తార్ వర్సెస్ ఫుట్‌బాల్..!

Iftar vs Football

హైదరాబాద్: ఒకవైపు ఫుట్‌బాల్ జోరు.. మరోవైపు పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరుల భక్తి, ప్రపత్తులు. అలాంటి ముస్లిం సోదరులు సాకర్ ఆటగాళ్ళయితే.. ఆట మధ్యలో ఉపవాస దీక్షను ఏ రోజుకారోజు విరమించుకోవాల్సి వస్తే.. ఏం చేయాలి? ఆట పట్ల తమకు గల నిబద్ధతను చాటుకుంటూనే భక్తి, ప్రపత్తులను చాటుకోవడమనే కత్తి మీద సాము చేయడమెలా?


సొలూష్యన్ చాలా సింపుల్. జస్ట్ టునీషియా ఫుట్‌బాల్ టీమ్‌ను ఫాలో అయితే చాలు. ఏం చేశారు? వాళ్ళను ఎందుకు ఫాలో కావాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌ను చదువుకుంటూ పోతే చాలు.. ఇలా కూడా చేయవచ్చా అని స్టన్ కావడం మీ వంతు అవుతుంది.


అసలు పాయింట్‌లోకి వస్తే టునీషియా టీమ్ పోర్చుగల్, టర్కీ టీమ్స్‌తో పోయినవారం రెండు ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడింది. అప్పటికే పవిత్ర రంజాన్ మాసం మొదలైంది. సరిగ్గా మ్యాచ్‌లు రసకందాయంలో పడే టైమ్‌లోనే ఉపవాస దీక్ష విరమించుకోవాల్సి వస్తున్నది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మరి ఐడియా గోల్ కీపర్‌దా లేక టీమ్ మెంబర్స్‌దా అంటే చెప్పలేం కానీ సరిగ్గా కావాల్సిన టైమ్‌కు గోల్  కీపర్‌కు గాయమై కింద పడిపోతాడు. అతడు అలా పడిపోగానే టీమ్స్ మెంబర్స్ మైదానం నుంచి పక్కకు వెళతారు. ఉపవాసాన్ని విరమిస్తారు. మినీ ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నట్టుగా అలా నిలబడి నాలుగు పండ్లు తినేసి, కాసిని మంచినీళ్ళు తాగేస్తారు. ఈలోగా గోల్‌కీపర్ కోలుకుంటాడు. మనవాళ్ళు మళ్ళీ మైదానంలోకి వచ్చేసి మ్యాచ్ కంటిన్యూ చేస్తారు. 


అలా చూసినప్పుడు మొదటి మ్యాచ్ క్రిస్టియానో రోనాల్డో లేని పోర్చుగల్ టీమ్‌తో ఆడారు. టునీషియా టీమ్ 2-1 తో మ్యాచ్‌తో కిందా మీదా పడిపోతున్నది. సరిగ్గా 58వ నిమిషం దగ్గర గోల్‌కీపర్ మొయిజ్ హస్సేన్ సెకండాఫ్ మొదట్లో గాయమైందంటూ కిందపడిపోయాడు. ఆ కాస్త విరామంలో ఇఫ్తార్ ముగించుకొని వచ్చిన టీమ్ సభ్యులు  రెండో గోల్ చేసి 2-2 వద్ద ఐరోపా ఛాంపియన్లను డ్రాకు పరిమితం చేశారు.ఇక రెండవ మ్యాచ్ టర్కీ‌తో మొదలైంది. హస్సేన్ 49వ నిముషం వద్ద గాయంతో పడిపోయాడు. టునీషియా ప్లేయర్స్ టచ్ లైన్ దగ్గరకు పరుగులు తీశారు. ఇఫ్తార్ ముగించుకొని వచ్చి 2-2తో మ్యాచ్ డ్రా చేశారు. 


అదండి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఇఫ్తార్ కథా కమామీషు.
ఇంతటి అపారమైన తెలివితేటలున్న టునీషియా టీమ్ 2018 వరల్డ్ కప్‌‌కు ఇంగ్లండ్‌తో ఆడటం ద్వారా నాంది పలకనుంది. 1956లో ఫ్రెంచి పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత టునీషియా వరల్డ్ కప్‌లో ఆడటం ఇది నాల్గవ సారి. 2006లో జర్మనీలో జరిగిన వరల్డ్ కప్‌లో చివరిసారిగా పాల్గొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios