టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్‌పై ఐసిసి ఓ ఆసక్తికర పోస్టర్‌ను విడుదల చేసింది.ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో సిరీస్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి టి20 ర్యాకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచాడు.
టీ 20 ప్రపంచకప్ 2022 భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన సూపర్ 12 మ్యాచ్ పై అందరీ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). ఈ కీలకమైన మ్యాచ్ కు ముందు.. పోటీని హైప్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఐసీసీ.. భారత యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసింది.
ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా,ఆస్ట్రేలియాతో సిరీస్‌లలో భారత్ విజయం సాధించడంలో డ్యాషింగ్ బ్యాటింగ్ సూర్య కుమార్ యాదవ్ కీ రోల్ పోషించాడు. అలాగే.. టి20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లలోనూ రాణించాడు. హాఫ్ సెంచరీలు చేశాడు. అలాగే.. ఇటీవల విడుదలైన ఐసీసీ టి20 ర్యాకింగ్స్‌లో సూర్య కుమార్ యాదవ్ రెండో స్థానంలో నిలిచాడు.
ఈ నేపథ్యంలో సూర్యకుమార్ కోసం హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ నటించిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'టాప్-గన్' ఆధారంగా ఐసిసి పోస్టర్‌ను విడుదల చేసింది. నటుడు టామ్ క్రూజ్ తో సూర్యకుమార్ ను పోలుస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అంతటితో సరిపెట్టకుండా.. “ఎస్‌కెవై.. ఆకాశమే నీకు హద్దు” అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఈ పోస్టర్ కు 40 వేలకుపైగా లైక్‌లతో.. దాదాపు 3 వేలకుపైగా రీట్వీట్లతో నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే.. కేన్ రిచర్డ్‌సన్ , రికీ పాంటింగ్ , వేన్ పార్నెల్ వంటి స్టార్ క్రికెటర్లు సూర్యకుమార్‌ను ప్రపంచ అత్యుత్తమ T20 బ్యాటర్‌లలో ఒకరిగా గుర్తించారు. అయితే ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ కేవలం 15 పరుగులే చేసి అభిమానులను నిరాశ పరిచాడు.
