Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ టెస్ట్ : రెండో రోజు భారత్‌దే...మరో వికెట్ పడకుండా అడ్డుకున్న రహానే, రిషబ్

హైదరాబాద్ లో జరుగుతున్న సెకండ్ టెస్ట్ లో రెండో రోజు ఆట ముగిసింది. మొదటి రోజు భారత బౌలర్లు విజృంభించగా, రెండో రోజు భారత బ్యాట్ మెన్స్ ఆ పని చేస్తున్నారు. దీంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. 

hyderabad test updatest
Author
Hyderabad, First Published Oct 13, 2018, 10:07 AM IST

హైదరాబాద్ లో జరుగుతున్న సెకండ్ టెస్ట్ లో రెండో రోజు ఆట ముగిసింది. మొదటి రోజు భారత బౌలర్లు విజృంభించగా, రెండో రోజు భారత బ్యాట్ మెన్స్ ఆ పని చేస్తున్నారు. దీంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. అయితే ఆరంభంలో భారత బ్యాట్ మెన్స్ కాస్త తడబడినా మిడిల్ ఆర్డర్ ఆదుకుంది. దీంతో భారత్  కేవలం 162 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన స్థాయి నుండి మరో వికెట్ పడకుండా 308 పరుగులు చేసింది.    

ఆరంభంలో  ఓపెనర్ పృథ్విషా మరోసారి అద్భుతంగా బ్యాటింగ్ చేసి హాప్ సెంచరీ(70 పరుగులు) సాధించాడు. ఆ తర్వాత వెంట వెంటనే రెండు వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీ (45 పరుగులు), రహానే మ్యాచ్ ను చక్కదిద్దడానికి ప్రయత్నించారు. వీరు కాస్త కుదురుకున్న సమయంలో 162 పరుగుల వద్ద కోహ్లీ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ రహానేతో కలిసి మంచి బాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో మరో వికెట్ పడకుండానే 308 పరుగుల వద్ద రెండో రోజు ఆట ముగిసింది. రహానే 75 పరుగులు 175 బంతుల్లో, రిషబ్ పంత్ 85 పరుగులు 120 బంతుల్లో సాధించి సెంచరీ దిశగా సాగుతున్నారు.

హైదరాబాద్ టెస్ట్ లో జరగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్ మెన్స్ రహానే, రిషబ్ పంత్ విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్నారు. ఇద్దరూ అర్థ శతకాలను పూర్తి చేసుకుని బ్యాటింగ్ చేస్తున్నారు. 162 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాలవైపు సాగుతున్న మ్యాచ్ ను ఈ జోడీ మలుపుతిప్పింది. వీరిద్దరు మరో వికెట్ పడకుండా చక్కటి బాగస్వామ్యాన్ని నెలకొల్పారు.వీరి విజృంభనతో భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. రహానే 122 బంతుల్లో, రిషబ్ 67 బంతుల్లో హాఫ్ సెంచరీలు సాధించి నాటౌట్ గా నిలిచారు.

హైదరాబాద్ టెస్టులో టీంఇండియా బ్యాట్ మెన్స్ తడబడుతున్నారు. విండీస్ బౌలర్ల దాటికి కేవలం 162 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  కాస్సేపు కెప్టెన్ కోహ్లీ, రహానే జంట వికెట్ల పతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే హోల్డర్ కోహ్లీని ౌట్ చేయడం ద్వారా ఈ జంటను విడగొట్టాడు. 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటైన కోహ్లి అర్థశతకాన్ని మిస్సయ్యాడు.ప్రస్తుతం క్రీజులో రహానే (19 పరుగులు), రిషబ్ పంత్ (9 పరుగులు) ఉన్నారు.. మొత్తానికి టీంఇండియా 47 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.  

ఆరంగేట్ర సెంచరీ వీరుడు పృథ్వీ షా హైదరాబాద్ మ్యాచ్ లోనూ దూకుడుగా ఆడాడు. ఆదిలోనే రాహుల్ (4 పరుగులు) వికెట్ కోల్పోయినా పృథ్వి మాత్రం వెనుకడుగు వేయలేదు. పుజారా తో కలిసి ఆడుతూ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో (70 పరుగులు 53 బంతుల్లో) పృథ్వి ఓ చొత్త షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఆ వెంటనే పుజారా ఔటయ్యాడు.

ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ కోహ్లీతో పాటు పుజారా ఉన్నారు. భారత .జట్టు 20 ఓవర్లలో 102 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది.    

హైదరాబాద్ లో జరుగుతున్న సెకండ్ టెస్ట్ లో మొదటిరోజు మిశ్రమ ఫలితం వెలువడిన విషయం తెలిసిందే. మొదట భారత బౌలర్ల జోరు కనిపించినా ఒకే ఒక్కడు విండీస్ జట్టును ఆదుకున్నాడు. చేస్ తన అద్భుత బ్యాటింగ్ తో ఒంటరిపోరాటం చేసి విండీస్ గౌరవప్రదమైన స్కోరు దిశగా నడిపించాడు. అతడికి హోల్డర్ అర్థశతకంతో చక్కటి సహకారం అందిచడంతో మొదటిరోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 295 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. చేస్ 98 పరుగులు చేసి సెంచరీకి కేవలం రెండు పరుగుల దూరంలో నిలిచాడు.

అయితే రెండోరోజైన ఇవాళ ఆట మొదలవగానే చేస్ సెంచరీ లాంచనాన్ని పూర్తిచేసుకున్నాడు. అయితే అతడు సెంచరీ తర్వాత ఎక్కువసేపు నిలవలేక పోయాడు. 106 పరుగుల వద్ద ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో చేస్ ఔటయ్యాడు. ఇలా చేస్ నిష్ర్కమన తర్వాత మ్యాచ్ దాదాపు పూర్తయింది. ఆ తర్వాతి బంతికే మరో వికెట్ పడటంతో విండీస్ ఆలౌటయ్యింది.

మొత్తంగా విండీస్ 311 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. ఉమేష్ యాదవ్ తన అద్భుత బౌలింగ్ తో విండీస్ జట్టు పతనాన్ని శాసించాడు. అతడు 6 వికెట్లు పడగొట్టగా కుల్దీప్ యాదవ్ 3, అశ్విన్ 1 వికెట్ పడగొట్టాడు. 

సంబంధిత వార్తలు

హైదరాబాద్ టెస్ట్: పరువు కాపాడిన చేస్...మొదటిరోజు విండీస్ స్కోరు 295/7

Follow Us:
Download App:
  • android
  • ios