అభిమానాన్ని సోమ్ము చేసుకుంటున్న కోహ్లీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పెడితే రూ.82.5 లక్షలు

how much earns virat kohli in social media
Highlights

ఒక్కో  సెలబ్రిటీ సోషల్ మీడియాలో కొన్ని కోట్ల మంది అభిమానులను కలిగి ఉన్నారు. అయితే కొందరు స్టార్లు అభిమానాన్ని క్యాష్ చేసుకుని కోట్లను సంపాదిస్తున్నారు

అభిమాన తారలు, క్రికెటర్లు ఈ మధ్యకాలంలో అభిమానులతో ఇంటరాక్ట్ కావడానికి సోషల్ మీడియా మీద ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు.. ఫ్యాన్స్ కూడా నిత్యం వారితో లైవ్ ఛాటింగ్, మేసేజింగ్‌తో సంబరపడిపోతున్నారు. అలా ఒక్కో  సెలబ్రిటీ సోషల్ మీడియాలో కొన్ని కోట్ల మంది అభిమానులను కలిగి ఉన్నారు. అయితే కొందరు స్టార్లు అభిమానాన్ని క్యాష్ చేసుకుని కోట్లను సంపాదిస్తున్నారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ జాబితాలో ఉన్నారు. మైదానంలో దూకుడుగా ఉండటంతో పాటు ట్రెండీ గా కనిపించే విరాట్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇక క్రికెట్‌ను మతంలా భావించే భారత్‌ సంగతి చెప్పనక్కర్లేదు. అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటాడు కోహ్లీ. ఇతను ఉంచే ఫోటోలన, వీడియోలను భారీగా షేర్ చేస్తుంటారు.

ఈ  ఫాలోయింగ్‌ను ఇన్‌స్టాగ్రామ్ వాడుకోవాలని భావించింది. దీనిలో భాగంగా కోహ్లీతో ఒప్పందం కుదుర్చుకుంది.. ఇందుకు గాను భారీగా ముట్టజెబుతోంది కూడా.. ఇన్‌స్టాగ్రామ్ షెడ్యూలర్ హోప్పర్‌హెచ్‌క్యూ విడుదల చేసిన 2018 ఇన్‌స్టాగ్రామ్ రిచ్ లిస్ట్ జాబితాలో కోహ్లీ  17వ స్థానంలో ఉన్నాడు.. ఇతను ఒక్కో పోస్ట్‌కు లక్షా 20 వేల అమెరికన్ డాలర్లను అంటే (రూ. 82,45,000)ను సంపాదిస్తున్నాడు. ఈ జాబితాలో కైలీ జెన్నర్ అగ్రస్థానంలో నిలిచారు. ఆమె ఒక్కో పోస్ట్‌కి రూ.6.86 కోట్లు తీసుకుంటుందని హోపర్‌హెచ్ క్యూ వెల్లడించింది.

loader