టీమిండియా సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌‌కు జట్టులో అవకాశం రాకపోతుండటం.. కెరీర్ డైలమాలో పడిన నేపథ్యంలో అతని భార్య బ్రిటీష్ మోడల్, హేజిల్ కీచ్ తన భర్త కెరీర్, వివాహ జీవితంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ‘‘ యువరాజ్ ఒకరిని మాట అనడు.. విమర్శించడు ఆ గుణమే నన్ను ఇంప్రెస్ చేసింది. కానీ అదే అతనికి కష్టాలు తెచ్చిపెడుతోందన్నారు. జట్టులో స్థానం కాపాడుకోవాలన్నా... శాశ్వతంగా జట్టులో ఉండాలన్నా రెండూ అవసరమేనని హేజిల్ అన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో జట్టులో చోటు దక్కడం లేదని ఎప్పుడూ బాధపడడని.. ఇప్పటికే క్రికెట్‌లో తన సత్తా ఎంతో నిరూపించుకున్నాడని... మరోసారి అవకాశం ఇస్తే తన బ్యాట్‌తోనే అందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపింది. మరో తాను జట్టులోకి తిరిగి వచ్చి.. పునర్వైభవం సాధిస్తానని యువరాజ్ సింగ్ గట్టి నమ్మకంతో ఉన్నాడు.