వాలీబాల్ క్రీడాకారిణీపై రెండున్నరేళ్లుగా కోచ్ అత్యాచారం.. మ్యాచ్‌ల మధ్యలోనే అఘాయిత్యం

Haryana Volleyball Player Raped By Coach
Highlights

తనపై కోచ్ రెండున్నరేళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ వాలీబాల్ క్రీడాకారిణీ ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.

తనపై కోచ్ రెండున్నరేళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ వాలీబాల్ క్రీడాకారిణీ ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. హర్యానాలోని రివారీ గ్రామానికి చెందిన ఓ బాలిక వాలీబాల్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహిస్తుంది. ఆమెపై కన్నేసిన  కోచ్ గౌరవ్ దేశ్వాల్ బాలికను లొంగదీసుకుని గత రెండున్నరేళ్ల  నుంచి అత్యాచారం చేస్తున్నాడు... ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో పాటు.. తన భవిష్యత్తు దృష్ట్యా బాలిక మౌనంగా అతని వేధింపులు భరించింది.

అయితే ఓపిక నశించిన క్రీడాకారిణీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్గావ్, రోహతక్‌తో పాటు పలు ప్రాంతాలకు తనను తీసుకెళ్లి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. గౌరవ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అతనిని ఇంత వరకు అరెస్ట్ చేయలేదు. దీనిపై వివరణ కోరగా.. విచారణ పూర్తయిన తర్వాత కోచ్‌ను అరెస్ట్ చేస్తామని తెలిపారు.

loader