హార్డిక్ పాండ్యా లవ్ స్టోరీ: ఆమెకు బ్రేకప్, ఈమెతో చెట్టాపట్టాల్

Hardik Pandya says breakup tu Elli AvrRam
Highlights

టీమిండియా క్రికెటర్ల డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో ఇటీవల జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.

ముంబై: టీమిండియా క్రికెటర్ల డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో ఇటీవల జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్వీడన్ మోడల్, నటి ఎల్లీ అవ్రామ్ బ్రేకప్ చెప్పినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.  

పాండ్యా అన్నయ్య, క్రికెటర్ కృనాల్ పాండ్యా వివాహానికి ఎల్లీ హాజరైంది. అప్పుడే వీరి డేటింగ్ రిలేషన్ బయటి ప్రపంచానికి తెలిసింది. అయితే, ఈ మధ్య వారిద్దరు దూరమైనట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అందుకు ‘హేట్‌ స్టోరీ 4’ నటి ఊర్వశి రౌతెలా కారణమనే ప్రచారం సాగుతోంది. పారిశ్రామికవేత్త గౌతం సింఘానియా పార్టీలో హార్ధిక్‌ పాండ్యా, ఊర్వశి కలుసుకున్నారు. అప్పటి నుంచి వారి మధ్య బంధం ప్రారంభమైనట్లు చెబుతున్నారు.

గతంలో ఎల్లీనే స్వయంగా హార్ధిక్ పాండ్యాను విమాశ్రయంలో డ్రాప్ చేసి  వెళ్తూ ఎల్లీ కెమెరా కంటికి చిక్కింది.  ఫొటోలు వైరల్‌ అయ్యాయి. తాజా పుకార్లపై ఎల్లీ గానీ, పాండ్యా గానీ స్పందించలేదు.

loader