Asianet News TeluguAsianet News Telugu

చిక్కుల్లో టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా... ఎయిర్ పోర్టులో ఐదుకోట్ల విలువైన లగ్జరీ వాచ్ లు సీజ్

ICC T20 వరల్డ్ కప్ 2021 జరుగుతున్న UAE నుండి భారతదేశానికి వచ్చిన టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వద్ద రూ. 5 కోట్ల విలువైన రెండు లగ్జరీ వాచీలు ఉన్నాయని ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు. దీంతో ఇప్పటికే ఫెయిల్యూర్ చవిచూస్తున్న హార్థిక్ కొత్తగా మరో ఇబ్బంది ఎదుర్కున్నట్టయ్యింది. 

Hardik pandya in trouble, his luxury watches worth rs. 5 crore seized airport customs officials
Author
Hyderabad, First Published Nov 16, 2021, 9:22 AM IST

ICC T20 వరల్డ్ కప్ 2021 జరుగుతున్న UAE నుండి భారతదేశానికి వచ్చిన టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వద్ద రూ. 5 కోట్ల విలువైన రెండు లగ్జరీ వాచీలు ఉన్నాయని కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు.

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డాడు. ఆదివారం నవంబర్ 14 అర్థరాత్రి ఆలస్యంగా భారత్‌కు చేరుకున్న హర్ధిక్ పాండ్యా దగ్గరున్న 5 కోట్ల విలువైన రెండు వాచీలను కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ జప్తు చేసింది. దీంతో గత కొంతకాలంగా ఫామ్‌తో సతమతమవుతున్న హార్ధిక్ కొత్త ఇబ్బందుల్లో పడ్డాడు.

ABP లైవ్ నివేదిక ప్రకారం, ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2021లో Hardik Pandya తన ప్రదర్శనతో నిరాశపరిచాడు. ఆ తరువాత టీమ్ ఇండియా ఆటగాళ్లు UAE నుండి ఇంటికి తిరుగుముఖం పట్టారు. ఈ క్రమంలోనే ఈ సంఘటన జరిగింది.

విమానాశ్రయానికి చేరుకున్న క్రమంలో కస్టమ్స్ అధికారుల చెకింగ్ లో హార్దిక్ వద్ద రూ.5 కోట్ల విలువైన రెండు లగ్జరీ వాచీలు ఉన్నట్లు గుర్తించారు. అయితే, ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ అయిన హార్దిక్ వద్ద ఈ వాచీలకు సంబంధించిన ఇన్‌వాయిస్‌లు లేవని, ఈ వాచీలను కస్టమ్స్ వస్తువులుగా ప్రకటించలేదని వారు అన్నారు. దీంతో కస్టమ్స్ అధికారులు అతని చేతి గడియారాలను స్వాధీనం చేసుకున్నారు.

హార్దిక్ పాండ్యా దగ్గర ప్రపంచంలోనే అత్యంత expensive watches ఉన్నాయి. అతనికి గడియారాల సేకరణ ఇష్టం. ఈ వాచ్ సేకరణలో పటెక్ ఫిలిప్ నాటిలస్ ప్లాటినం 5711 కూడా ఉంది. దీని ధర రూ. 5 కోట్లకు పైగా ఉంటుంది.

GQ ఇండియా ప్రకారం, ఈ వాచ్ పూర్తిగా ప్లాటినంతో రూపొందించబడింది. 32 baguette-cut emeralds  పొదగబడి ఉంటుంది. 5711వాచ్ లో.. గంటల ప్లేస్ లో మార్కర్లుగా పచ్చలను కలిగి ఉంది. self-winding  ఆటోమేటిక్ మూమెంట్స్ తో నడుస్తుంది.

ఆగస్ట్‌లో, IPL 2021 second legకి ఒక నెల ముందు, హార్దిక్ ఇన్ స్టా గ్రామ్ లో వరుస చిత్రాలను పోస్ట్ చేశాడు. ఆ ఫొటోల్లో అతనికి చేతికి luxurious watch కూడా ఉంది.

దేశం విడిచి వెళ్లినందుకు బాధగా లేదు, అందుకే క్రికెట్ ఆడుతున్నా... ఉన్ముక్త్ చంద్ కామెంట్స్...

ఇదిలా ఉంటే.. గత సంవత్సరం, హార్దిక్ పాండ్యా అన్నయ్య, కృనాల్ పాండ్యా దుబాయ్ నుండి తిరిగి వస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. అతని వద్ద లెక్కచెప్పని బంగారం, ఇతర విలువైన వస్తువులు కలిగి ఉన్నాడనే అనుమానంతో ముంబై విమానాశ్రయంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి చెకింగుల్లో కృనాల్ వద్ద 1 కోటి రూపాయల విలువైన బంగారం,  కొన్ని undisclosed లగ్జరీ వాచీలు దొరికాయి.

డీఆర్‌ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేసు non-recurring type కావడంతో ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్‌కు అప్పగించారు. ఇదిలా ఉండగా, నవంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో హార్దిక్‌ను టీమ్ ఇండియా జట్టులో చేర్చలేదు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో పాండ్యా 69 పరుగులు మాత్రమే చేయడంతో పూర్తిగా ఫ్లాప్ కావడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios