హార్డిక్ పాండ్యా, ధావన్ ఇంగ్లండులో బాత్రూమ్ డ్యాన్స్ (వీడియో)

First Published 2, Jul 2018, 7:06 PM IST
Hardik and Dhawan dance in Manchestar
Highlights

ఇంగ్లండు పర్యటనలో భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మాంచెస్టర్‌: ఇంగ్లండు పర్యటనలో భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం టీమిండియా తొలి ట్వంటీ20 మ్యాచ్ ఆడేందుకు మాంచెస్టర్ చేరుకుంది. 

మూడు టీ20 మ్యాచుల సిరిస్‌లో భాగంగా తొలి టీ20 జరిగే మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ స్టేడియంలో కోహ్లీసేన నెట్ ప్రాక్టీస్‌కు సిద్ధమైంది. ప్రాక్టీస్‌కు ముందు శిఖర్‌ ధావన్-హార్దిక్‌ పాండ్యా కలిసి డ్యాన్స్ చేశారు.

వీరిద్దరూ కలిసి అద్దం ముందు డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను హార్దిక్‌ పాండ్యా తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. "నేను, జట్టా(శిఖర్‌ ధావన్‌ను సహచర ఆటగాళ్లు ఇలాగే పిలుస్తారు) డ్యాన్స్‌ చేస్తూ దొరికిపోయాం. మా ఇద్దరికీ డ్యాన్స్‌, పాటలు పాడటం అంటే చాలా ఇష్టం" అని పాండ్యా చెప్పుకున్నాడు. 

మంగళవారం ఇంగ్లండ్‌తో టీమిండియా తొలి టీ20 మ్యాచ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

 

loader