న్యూజిలాండ్‌తో హామిల్టన్‌లో జరిగిన మూడవ టీ20లో భారత్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా చివరి ఓవర్లో సింగిల్‌ను అనవసరంగా వదులుకోవడం వల్లే ఓడిపోయామనే భావన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో దినేశ్ కార్తీక్‌పై అభిమానులు, మాజీలు మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హార్భజన్ సింగ్ కూడా దినేశ్ కార్తీక్‌నే తప్పుబట్టాడు. మ్యాచ్ అనంతరం ఓ జాతీయ ఛానెల్‌‌తో మాట్లాడిన భజ్జీ... దినేశ్ కార్తీక్ చేసిన చిన్న తప్పు వల్లే భారత్ పరాజయం చవి చూసింది. అతను సింగిల్‌ తీయకపోవడం భారత్‌ను ఘోరంగా దెబ్బతీసిందన్నాడు.

తన మీద తనకు నమ్మకం ఉండటం మంచిదే కానీ.. అదే నమ్మకాన్ని ఇతరులపైనా ఉంచాలని సూచించాడు. నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో చివరి బంతికి సిక్స్ కొట్టడం వల్ల కార్తీక్‌కు ఫినిషర్ ట్యాగ్ వచ్చింది.. కానీ అక్కడ బౌలింగ్ చేసింది సౌమ్య సర్కార్.. టీమ్ సౌథీ కాదనే విషయాన్ని దినేశ్ గ్రహించలేకపోయాడని హార్భజన్ వ్యాఖ్యానించాడు.

కృనాల్ అంతకు ముందు ఓవర్‌లో 18 పరుగులు రాబట్టి... మంచి ఫాంలోనే ఉన్నాడు.. ఆ సింగిల్ తీసి కృనాల్‌కు అవకాశం ఇచ్చివుంటే పరిస్థితి మరోలా ఉండేదని భజ్జీ అభిప్రాయపడ్డాడు. ఏదీ ఏమైనా కార్తీక్ చేసిన తప్పు సిరీస్‌ను కోల్పోయేలా చేసిందన్నాడు. మరోవైపు ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌కు ముందు టీమ్ మేనేజ్‌మెంట్ చేపట్టిన ప్రయోగాలు ఫలించాయని భజ్జీ అభిప్రాయపడ్డాడు. 

ఆ రెండు తప్పిదాలు..భారత్‌ను ఓడించాయా..?

దేశమే ముందు: ధోనీ దేశభక్తికి సలాం

పరుగు కోసం పాండ్యా...వెనక్కెళ్లమన్న దినేశ్ కార్తీక్: నెటిజన్ల ఫైర్

హామిల్టన్ టీ20: పోరాడి ఓడిన భారత్, సిరీస్ న్యూజిలాండ్ వశం

టీ20ల్లో ధోనీ అరుదైన రికార్డు.. 300 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా..

క్యాచ్‌లు నేలపాలు.. నెత్తి బాదుకుంటూ పాండ్యా ఫ్రస్ట్రేషన్

అదృష్టం న్యూజిలాండ్ వైపే.. ఆ బాల్ వైడ్ అయ్యుంటే