Asianet News TeluguAsianet News Telugu

చెలరేగిన కోహ్లీ, రోహిత్: భారత్ చేతిలో వెస్టిండీస్ చిత్తు

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో గౌహతిలో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ భారత్ ముందు 323 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది

Guwahati ODI: westindies loss first wicket
Author
Guwahati, First Published Oct 21, 2018, 1:58 PM IST

భారత్ పై తొలి వన్డేలో భారీ లక్ష్యాన్ని ఉంచామనే వెస్టిండీస్ ఆటగాళ్ల ఆశలను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నీరు గార్చారు. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం గౌహితిలో జరిగిన తొలి వన్డేలో తమ ముందు ఉంచిన 323 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఎనిమిది వికెట్ల తేడాతో వెస్టిండీస్ ను భారత్ చిత్తు చేసింది. 

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చెలరేగి ఆడి సెంచరీలు సాధించారు. దీంతో భారత్ అలవోకగా వెస్టిండీస్ పై 47 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. రోహిత్ శర్మ 117 బంతుల్లో 8 సిక్స్ లు, 15 ఫోర్లతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంబటి రాయుడు 26 బంతుల్లో 22 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

భారత్ ఆదిలో అతి తక్కువ స్కోరుకే శిఖర్ ధావన్ వికెట్ ను కోల్పోయింది. అయితే, ఆ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సిక్స్ లు, ఫోర్లతో చెలరేగిపోయారు. విరాట్ కోహ్లీ 107 బంతుల్లో రెండు సిక్స్ లు, 21 ఫోర్లతో 140 పరుగులు చేసి బిషూ బౌలింగ్ లో స్టంపౌట్ అయ్యాడు. 

తమ కెరీర్ లో విరాట్ కోహ్లీ 35వ సెంచరీ సాధించగా, రోహిత్ శరమ్ 20వ సెంచరీని సాధించాడు. ఈ మ్యాచుతో కోహ్లీ అంతర్జాతీయ వన్డేల్లో ఛేజింగ్ లో 6 వేల పరుగులు చేశాడు. అంతకు ముందు సచిన్ టెండూల్కర్ ఒక్కడే ఆ ఘనతను సాధించాడు.

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో గౌహతిలో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ భారత్ ముందు 323 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

షమీ బౌలింగ్‌లో ఓపెనర్ హేమజ్ ఔటయ్యడు. ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తూ.. అర్థసెంచరీలో మంచి ఊపులో ఉన్న ఓపెనర్ పొవెల్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు..ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన సీనియర్ ఆటగాడు శామ్యూల్ పరుగులేమి చేయకుండానే చాహల్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.

అనంతరం రక్షిస్తాడనుకున్న హోప్ కూడా షమీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరడంతో విండీస్ కష్టాల్లో పడింది. నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును కియారెన్ పొవెల్, హోప్, రోవ్‌మెన్ పొవెల్‌తో కలిసి ఆదుకున్నాడు.

మిగిలిన వారు ఆచితూచి ఆడుతున్నప్పటికీ మేయర్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు.. ఈ క్రమంలో 74 బంతుల్లో సెంచరీ సాధించాడు.. ఇందులో 6 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. హెట్‌మేయర్‌కు ఇది వన్డేల్లో మూడవ సెంచరీ..

శతకానికి మరో ఆరు పరుగులు జోడించిన తర్వాత జడేజా బౌలింగ్‌లో పంత్‌కి క్యాచ్ ఇచ్చి అతను వెనుదిరిగాడు. అయితే చివర్లో హోల్డర్, బిషో, రోచ్‌లు ధాటిగా ఆడటంతో వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. భారత బౌలర్లలో చాహల్ 3, రవీంద్ర జడేజా, షమీ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios