ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ చివరివరకు ఉత్కంఠగా సాగింది. అయితే కేవలం 6 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ కు విజయం వరించింది. 

GT vs RR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 లో మరో ఉత్కంఠ పోరు గుజరాత్ నరేంద్రమోదీ స్టేడియంలో జరిగింది. సొంత మైదానంలో గుజరాత్ టీం ఓటమిపాలయ్యింది... రాజస్థాన్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో వరుస విజయాలతో ఐపిఎల్ పాయింట్స్ టేబుల్ లో RR టాప్ లో నిలిచింది.

రాజస్థాన్ బ్యాటింగ్ సాగిందిలా.. 

రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసి ఏకంగా 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 55 పరుగులు (36 బంతుల్లో), యువ సంచలనం వైభవ్ సూర్యవంశి 31 పరుగులు (18 బంతుల్లో) మంచి ఆరంభం అందించారు. ఆ తర్వాత ద్రువ్ జురేల్ 75 పరుగులు (42 బంతుల్లో), హెట్మెయర్ 18 పరుగులు (8 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్ లు తోడవడంతో స్కోరు 210 పరుగులకు చేరుకుంది.

గుజరాత్ బ్యాటింగ్

భారీ లక్ష్యచేధన కోసం బరిలోకి దిగిన గుజరాత్ ను గెలిపించాలన్న తాపత్రయంతో ఓపెనర్ సాయి సుదర్శన్ 73 పరుగులు (44 బంతుల్లో) దూకుడుగా ఆడాడు. బట్లర్ 26 పరుగులు (14 బంతుల్లో), చివర్లో కెప్టెన్ రషీద్ ఖాన్ 24 పరుగులు (16 బంతుల్లో), రబాడా 23 పరుగులు (16 బంతుల్లో) మెరుపులు మెరిపించినా లాభం లేకుండాపోయింది. 204 పరుగుల వద్దే గుజరాత్ ఇన్నింగ్స్ ఆగిపోయింది... దీంతో 6 పరుగుల స్వల్ప తేడాతో రాజస్థాన్ గెలిచింది.

గుజరాత్ బౌలర్లలో రబాడా 2 వికెట్లు పడగొట్టాడు. అదే రాజస్థాన్ బౌలర్లలో రవి బిష్ణోయ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు... ఏకంగా 4 వికెట్లు పడగొట్టి జిటి ఓటమిని శాసించాడు.