MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Gutta Jwala : అమ్మతనానికే అర్థం చెప్పిన హైదరబాదీ ప్లేయర్.. ఇన్ని లీటర్ల చనుబాలు దానంచేశావా తల్లీ..!

Gutta Jwala : అమ్మతనానికే అర్థం చెప్పిన హైదరబాదీ ప్లేయర్.. ఇన్ని లీటర్ల చనుబాలు దానంచేశావా తల్లీ..!

Breast Milk Donation : హైదరాబాద్ కు చెందిన స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల అమ్మతనానికి అసలైన అర్థం చెప్పారు. కడుపున పుట్టిన బిడ్డకే కాదు ఎంతోమంది తన చనుబాలు అందించి అమ్మగా మరో మెట్టు ఎక్కేశారు. ఎన్ని లీటర్ల పాలు దానం చేశారో తెలుసా..? 

2 Min read
Author : Arun Kumar P
Published : May 15 2026, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అసలైన అమ్మతనం ఇదేగా..
Image Credit : INSTAGRAM/Jwala Gutta

అసలైన అమ్మతనం ఇదేగా..

గుత్తా జ్వాల... క్రీడాప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు అందుకున్నారు.. 2010, 2014 కామన్వెల్త్ గేమ్స్ లో వరుసగా రెండు స్వర్ణ పతకాలు సాధించి భారతీయుల మనసులు గెలుచుకున్నారు. ఇలా తన ఆటతో ఆకట్టుకున్న గుత్తా జ్వాల ఇప్పుడు అమ్మతనంతో ఆదర్శంగా నిలిచారు.

కేవలం తాను, తన కుటుంబం, తన పిల్లలు అంటూ ఆలోచించేవారే ఎక్కువగా ఉన్న ఈ కలికాలంలో జ్వాల చాలా గొప్పగా ఆలోచించారు. ఈ సమాజాన్ని తన కుటుంబంగా భావించిన ఆమె తల్లిపాలకు దూరమైన చిన్నారులకు అమ్మలా మారారు... తన చనుబాలను దానం చేస్తూ ఎందరో చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. ఇలా చిన్నారులకు ప్రేమను పంచుతూ నేటితరం అమ్మలకు ఆదర్శంగా నిలుస్తున్నారు గుత్తా జ్వాల.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
60 లీటర్ల చనుబాలు దానమా..!
Image Credit : X/Guttajwala

60 లీటర్ల చనుబాలు దానమా..!

హైదరాబాద్ కు చెందిన బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల తమిళనాడుకు చెందిన సినీనటుడు విష్ణు విశాల్ ను 2021 లో పెళ్లాడింది. గతేడాదే జ్వాల ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది... ఆ శిశువు ఆరోగ్యవంతంగా పెరుగుతోంది. అయితే తన బిడ్డలాగే ప్రతి చిన్నారి ఆరోగ్యవంతంగా ఉండాలని ఆ తల్లిమనసు కోరుకుంది... అందుకే తనవంతుగా తల్లిపాలను దానం చేయడం ప్రారంభించారు జ్వాల.

తన బిడ్డకు సరిపడా పాలు ఇచ్చాక మిగిలిన పాలను వృధా చేయకూడదని జ్వాల నిర్ణయించుకున్నారు... అందుకే చనుబాలను దానం చేయడం ప్రారంభించారు. ఇలా ప్రతిరోజు సుమారు 600 మిల్లి లీటర్ల పాలను ప్రభుత్వ హాస్పిటల్స్ లో తల్లిపాలకు దూరమైన శిశువులకు అందిస్తోంది. ఇప్పటివరకు ఏకంగా 60 లీటర్ల తల్లిపాలను గుత్తా జ్వాల దానం చేశారు. తనలాగే ప్రతి తల్లి బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేయాలని కోరారు... దీంతో ఆరోగ్యవంతమైన సమాజం రూపుదిద్దుకుంటుందని అన్నారు.

Related Articles

Related image1
బిడ్డ పుట్టిన తర్వాత తల్లి పాలు ఎక్కువగా రావాలంటే ఏం చేయాలి..?
Related image2
అమ్మపాలు అంగడిపాలు..! 300 ML తల్లి పాలకు రూ.4,500 వసూలు చేస్తున్న సంస్థ, అనుమతులు లేకుండానే భారత్‌లో వ్యాపారం
34
తల్లిపాలతో శిశువుకు ఎన్ని లాభాలో తెలుసా..?
Image Credit : INSTAGRAM/Jwala Gutta

తల్లిపాలతో శిశువుకు ఎన్ని లాభాలో తెలుసా..?

నవజాత శిశువులకు అత్యంత శ్రేష్ఘమైన ఆహారం తల్లిపాలు. వీటిలో శిశువుకు అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి...అందుకే డాక్టర్లు తల్లిపాలనే ఇవ్వాలని సూచిస్తుంటారు. కానీ కొందరు తల్లులకు వివిధ కారణాలతో చనుబాలు రావు... ఇలాంటి సమయంలో ఇతర మహిళలు డొనేట్ చేసే చనుబాలు ఉపయోగపడతాయి... శిశువు ఆకలిని తీర్చడమే కాదు ఆరోగ్యాన్ని అందిస్తాయి.

తల్లిపాలు శిశువులో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటుంది. వివిధ రకాల ఇన్పెక్షన్స్ నుండి కూడా శిశువును రక్షిస్తాయి. శిశువు ఎదుగుదలలో కూడా తల్లిపాలు కీలకపాత్ర పోషిస్తాయి... ఎందుకంటే వీటిలో ఇందుకు అవసరమమైన పోషకాలు ఉంటాయి. అలాగే పిల్లల మెదడు ఎదుగుదలకు కూడా తల్లిపాలు ఉపయోగపడతాయి.

తల్లిపాలను శిశువు జీర్ణవ్యవస్థ సులభంగా జీర్ణం చేసుకుంటుంది... అదే బయటిపాలు పడితే జీర్ణ సమస్యలు ఎదురుకావచ్చు. ఇక భవిష్యత్ లో స్థూలకాయం, డయాబెటిస్ వంటి సమస్యలను తల్లిపాలు నిరోధిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా తల్లీ, బిడ్డ మధ్య అనుబంధాన్ని ఈ చనుబాలు పెంచుతాయి. అందుకే బిడ్డకు ఏడాది వయసు వచ్చేవరకు తల్లిపాలు ఇవ్వడం మంచిదని వైద్య నిపుణులు చెబుతుంటారు.

44
తల్లిపాలతో నెలకు రూ.10 సంపాదన...
Image Credit : X/Guttajwala

తల్లిపాలతో నెలకు రూ.10 సంపాదన...

అమెరికాకు చెందిన ఓ మహిళ తల్లిపాలను అమ్ముతూ నెలకు లక్షల్లో సంపాదిస్తోంది... ఈ విషయాన్ని ఆమె బైటపెట్టింది. ప్లోరిడాకు చెందిన 32 ఏళ్లు జూలీ డేనిస్ సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది... ఈ క్రమంలోనే ఆమె తన చనుబాలను అమ్మడం ప్రారంభించింది. ఇలా పాలను అమ్ముతూనే ఆమె నెలకు రూ.10 లక్షల వరకు ఆదాయం పొందిందట. ఇలా కొందరు తల్లిపాలను వ్యాపారంగా మార్చుకుంటే గుత్తా జ్వాల మాత్రం ఉచితంగానే ప్రభుత్వ హాస్పిటల్స్ కి పాలను దానం చేస్తూ గొప్పమనసు చాటుకున్నారు… ఎందరో చిన్నారులకు దేవుడిచ్చిన అమ్మగా మారారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
మహిళలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Tilak Varma: అవమానించిన చోటే గెలిచాడు.. ఇది కదా తెలుగోడి రివేంజ్ అంటే! అర్ష్‌దీప్‌ను చితక్కొట్టిన తిలక్ వర్మ!
Recommended image2
IPL 2026: తిలక్ వర్మ దెబ్బ.. పంజాబ్ అబ్బా.. ఒక్క ఓవర్లో సీన్ మొత్తం మార్చేశాడుగా !
Recommended image3
Virat Kohli: రిటైర్మెంట్ పై కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్ !
Related Stories
Recommended image1
బిడ్డ పుట్టిన తర్వాత తల్లి పాలు ఎక్కువగా రావాలంటే ఏం చేయాలి..?
Recommended image2
అమ్మపాలు అంగడిపాలు..! 300 ML తల్లి పాలకు రూ.4,500 వసూలు చేస్తున్న సంస్థ, అనుమతులు లేకుండానే భారత్‌లో వ్యాపారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved