MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ దెబ్బ.. పంత్, అక్షర్, రహానేలకు దిమ్మతిరిగే షాక్ !

IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ దెబ్బ.. పంత్, అక్షర్, రహానేలకు దిమ్మతిరిగే షాక్ !

IPL 2026 : ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు నుంచి లక్నో, ముంబై టీమ్స్ అవుట్ అయ్యాయి. అలాగే, ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ జట్లకు అవకాశాలు దాదాపు లేనట్టే. ఈ క్రమంలోనే ఆయా ప్రాంఛైజీలు తమ కెప్టెన్ల పై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అయ్యాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 15 2026, 01:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
క్లైమాక్స్ సీన్ లో కెప్టెన్ల ఫేట్ ఛేంజ్
Image Credit : ANI

క్లైమాక్స్ సీన్ లో కెప్టెన్ల ఫేట్ ఛేంజ్

ఐపీఎల్ 2026 సీజన్ ఎండ్ గేమ్ కి వచ్చేసింది. లీగ్ స్టేజ్ మ్యాచులు ముగుస్తున్న కొద్దీ ప్లేఆఫ్స్ రేసు హీటెక్కుతోంది. అయితే, కొన్ని టీమ్స్ కి మాత్రం ఈ సీజన్ ఒక డిజాస్టర్ లా మిగిలిపోయింది. ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG), ముంబై ఇండియన్స్ టీమ్స్ ఆల్రెడీ టోర్నీ నుంచి అఫీషియల్ గా అవుట్ అయిపోగా.. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా దాదాపు ప్యాకప్ చెప్పేసే పొజిషన్ లో ఉన్నాయి.

వరుసగా రెండు సీజన్ల పాటు టీమ్స్ ని సరిగ్గా లీడ్ చేయలేకపోయిన ముగ్గురు స్టార్ కెప్టెన్లు.. అక్షర్ పటేల్, రిషబ్ పంత్, అజింక్య రహానేల భవితవ్యంపై ఫ్రాంచైజీలు కఠిన నిర్ణయాలు తీసుకునేలా కనిపిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
లక్నోలో పంత్ ఫెయిల్యూర్.. గోయెంకా సీరియస్
Image Credit : ANI

లక్నోలో పంత్ ఫెయిల్యూర్.. గోయెంకా సీరియస్

లక్నో సూపర్ జెయింట్స్ కి ఈ సీజన్ పెద్ద షాక్. దాదాపు మూడు మిలియన్ డాలర్ల భారీ ప్రైస్ ట్యాగ్ తో రిషబ్ పంత్ ని కొనుగోలు చేసిన ఓనర్ సంజీవ్ గోయెంకాకు రిజల్ట్స్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వరుసగా రెండు సీజన్ల వైఫల్యం తర్వాత పంత్ పై వేటు పడటం దాదాపు ఖాయమైంది. ఈ సీజన్ లో 11 మ్యాచులాడిన పంత్ కేవలం 9 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. తన నార్మల్ అగ్రెసివ్ గేమ్ ని మర్చిపోయి తీవ్ర ఒత్తిడిలో ఆడుతున్నట్లు క్లియర్ గా కనిపించింది.

34
ఢిల్లీ క్యాపిటల్స్ లో అక్షర్ ప్లాప్ షో.. వేటు తప్పదా?
Image Credit : ANI

ఢిల్లీ క్యాపిటల్స్ లో అక్షర్ ప్లాప్ షో.. వేటు తప్పదా?

ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్న అక్షర్ పటేల్ అటు లీడర్ షిప్ లోనూ, ఇటు ప్లేయర్ గానూ అట్టర్ ప్లాప్ అయ్యాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో కలిపి అక్షర్ చేసింది కేవలం 100 పరుగులు మాత్రమే. అందులో ఒకే ఒక్క మ్యాచ్ లో 56 రన్స్ కొట్టాడు, మిగిలిన 8 ఇన్నింగ్స్‌ల్లో కలిపి కనీసం యాభై రన్స్ కూడా చేయలేకపోయాడు. బౌలింగ్ లోనూ తన మ్యాజిక్ రిపీట్ చేయలేదు. 12 మ్యాచ్‌ల్లో కేవలం 36 ఓవర్లు మాత్రమే వేశాడు. ఇటు కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్, బౌలింగ్ లో పెద్దగా రాణించలేకపోవడంతో అక్షర్ కు ఢిల్లీ క్యాపిటల్స్ షాక్ ఇచ్చే ప్లాన్ లో ఉంది.

44
రహానే కెరీర్ కి ఎండ్ కార్డ్ పడినట్లేనా?
Image Credit : ANI

రహానే కెరీర్ కి ఎండ్ కార్డ్ పడినట్లేనా?

కోల్‌కతా నైట్ రైడర్స్ లో అజింక్య రహానే కెప్టెన్సీ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్. టీమ్ లో వేరే ఆప్షన్ లేకపోవడం, తన క్లోజ్ ఫ్రెండ్ అభిషేక్ నాయర్ కోచ్ గా ఉండటంతో రహానేకు లీడర్ షిప్ దక్కింది. కానీ రహానే (133 స్ట్రైక్ రేట్), అంగ్క్రిష్ రఘువంశీ (139 స్ట్రైక్ రేట్) ఇద్దరూ కలిసి టాప్ ఆర్డర్ లో టెస్ట్ మ్యాచ్ ఆడేయడం కేకేఆర్ ని దెబ్బతీసింది. వీరిద్దరూ కలిసి 11 మ్యాచ్‌ల్లో కొట్టింది కేవలం 25 సిక్సర్లు మాత్రమే. వచ్చే వేలంలో అక్షర్, పంత్ లకు ప్లేయర్స్ గా క్రేజ్ ఉన్నా, రహానేను మాత్రం ఏ టీమ్ కొనే ఛాన్స్ కనిపించడం లేదు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
Tilak Varma: అవమానించిన చోటే గెలిచాడు.. ఇది కదా తెలుగోడి రివేంజ్ అంటే! అర్ష్‌దీప్‌ను చితక్కొట్టిన తిలక్ వర్మ!
Recommended image2
IPL 2026: తిలక్ వర్మ దెబ్బ.. పంజాబ్ అబ్బా.. ఒక్క ఓవర్లో సీన్ మొత్తం మార్చేశాడుగా !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved