Golden Girl of India Sheetal Devi: రెండు చేతుల లేకపోయినా వెనుకడుగు వేయకుండా విలువిద్యలో అద్భుతాలు చేసిన కాశ్మీరీ అమ్మాయి, 'గోల్డెన్ గర్ల్ ఆఫ్ ఇండియా' శీతల్ దేవిని భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా అర్జున అవార్డు పురస్కారం అందుకుంది.
India's para-athlete Sheetal Devi: రెండు చేతులు లేకపోయిన విలువిద్యలో అద్భుతాలు చేసి.. చిన్న మారుమూల గ్రామం దేశం గర్వించదగ్గ క్రీడాకారుణునిగా ఎదిగింది.. గోల్డెన్ గర్ల్ ఆఫ్ ఇండియా గా పెరుసంపాదించింది.. ఆమె శీతల్ దేవి. చేతులు లేకపోయిన విలువిద్యలో రాణించి ఎన్నో బంగాలు పతకాలు గెలుచుకుని ప్రపంచ క్రీడాకారుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది శీతల్ దేవి. క్రీడారంగంలో శీతల్ దేవి సాధించిన విజయాలకు గుర్తించిన ప్రభుత్వం ఆమెను అర్జున అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకుంది.
జమ్మూకాశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలోని పర్వత పల్లెకు చెందిన ఓ చిన్న గ్రామం నుంచి శీతల్ దేవి విలువిద్యలో తన ప్రయాణం సాగిస్తూ.. నేడు యావత్ ప్రపంచం మెచ్చుకునే క్రీడాకారుణిగా రాణిస్తోంది. చేతులు లేకుండా విలువిద్యలో రాణిస్తున్న తొలి భారతీయ ఆర్చర్ శీతల్ దేవి. తన కాళ్లనే చేతులుగా మార్చుకుని విలువిద్యలో రాణిస్తోంది. చైనాలో జరిగిన ఆసియా పారా గేమ్స్ లో 16 ఏళ్ల శీతల్ రెండు స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించింది. ప్రస్తుతం ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
పుట్టుకతోనే దివ్యాంగురాలైన శీతల్ దేవి.. జమ్ముకశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలోని మారుమూల కొండ గ్రామమైన లోయి ధార్ కు చెందిన నిరుపేద కుటుంబంలో పుట్టింది. శీతల్ పుట్టుకతోనే ఫోకోమెలియా అనే వ్యాధితో బాధపడుతుంది. అయితే శీతల్ ఈ వ్యాధిని శాపంగా మారనివ్వకుండా.. క్రీడారంగంలో రాణిస్తోంది. తన జీవితం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నా.. ఎప్పూడు లొంగిపోలేదు.. సవాళ్లను అధిగమిస్తూ.. ముందుకు సాగుతోంది. 2019 లో 11 రాష్ట్రీయ రైఫిల్స్ నార్తర్న్ కమాండ్ ఆమెను దత్తత తీసుకొని కుటుంబానికి సహాయం చేయడం ప్రారంభించింది. 2021లో కుటుంబం మేజర్ అక్షయ్ గిరీష్ తల్లి మేఘనా గిరీష్ ను ప్రోస్థెటిక్ అవయవాల కోసం సంప్రదించింది.
'ముబారక్ హో లాలా'.. మహ్మద్ షమీ అర్జున అవార్డు అందుకోవడంపై విరాట్ కోహ్లీ రియాక్షన్ !
మేఘనా గిరీష్, ఆమె సహాయంతో శీతల్ కృత్రిమ చేతులను పొందగలిగింది. కానీ, శీతల్ తన విలువిద్యను ఛాతీ, నోరు, పాదాలను ఉపయోగిస్తూ విలువిద్యను ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. తన బలమైన కాళ్ళతో సహాయంతో విలువిద్యలో అభ్యసించింది. ఆ తర్వాత బెంగళూరుకు చెందిన ప్రీతి రాయ్ ను కలిసి స్పోర్ట్స్ ఎన్జీవోల సాయంతో ఆర్చరీలో ప్రావీణ్యం సంపాదించింది. ప్రీతి రాయ్ స్ఫూర్తి, కృషితో శీతల్ 2023లో ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో పతకం సాధించింది. కోచ్ కుల్దీప్ బైద్వాన్ షీతల్ కోసం నోరు, కాళ్ల సాయంతో విలువిద్య నేర్పేందుకు ప్రత్యేక కిట్ ను రూపొందించాడు. గురువులు, తల్లిదండ్రుల ఆశీస్సులు, తన కృషితో శీతల్ రెండు స్వర్ణాలు, ఒక రజతంతో ఆసియా పారా గేమ్స్ పతక విజేతగా నిలిచింది.
నేడు శీతల్ కిష్త్వార్ జిల్లాకే కాకుండా యావత్ దేశానికి ఐకాన్. శీతల్ దేవి శక్తి సామర్థ్యాలకు, ధైర్యసాహసాలకు జాతీయ, అంతర్జాతీయంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇప్పుడు శీతల్ దేశానికి ఒలింపిక్ స్వర్ణం తీసుకురావడానికి కృషి చేస్తోంది.
భారత టీ20 జట్టులోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్..