పెరూలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌‌లో మను భకర్‌కి స్వర్ణం... భారత్ ఖాతాలో ఓ స్వర్ణం, రెండు రజతాలు, ఓ కాంస్యం...

టోక్యో ఒలింపిక్స్‌లో పిస్టల్ మాల్‌ఫంక్షన్ కారణంగా ఒత్తిడికి గురై, తీవ్రంగా నిరాశపర్చిన భారత నెం.1 షూటర్ మను భకర్, పెరూలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌‌లో స్వర్ణం సాధించింది.

10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భకర్ గోల్డ్ మెడల్ సాధించగా... భారత షూటర్ ఇషా సింగ్ రజత పతకాన్ని సాధించింది... మరో భారత షూటర్ రిథమ్ సంగ్వాన్ నాలుగో స్థానంలో నిలిచి, స్వల్ప పాయింట్ల తేడాతో పతకాన్ని కోల్పోయింది..

అంతకుముందు 10మీటర్ల మెన్స్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో రజతం సాధించిన భారత షూటర్ రుద్రాక్ష్ పాటిల్, రెండో స్థానంలో నిలిచి రజతం సాధించాడు... ఇదే విభాగంలో భారత్ నుంచి బరిలో దిగిన శ్రీకాంత్ ధనుష్ 8వ స్థానంలో, పార్థ్ మకిజా 7వ స్థానంలో నిలిచారు. 

17 ఏళ్ల భారత యంగ్ షూటర్ రమితా, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించింది. ఇదే విభాగంలో భారత్ తరుపున పోటీపడిన మెహుల్ ఘోష్ 5వ స్థానంలో, నిశా కన్వార్ 8వ స్థానంలో నిలిచారు...