ఏషియన్ గేమ్స్ 2023: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. పాకిస్తాన్‌ని చిత్తు చేసి పిసిడి పట్టిన స్క్వాష్ టీమ్..
పురుషుల స్క్వాష్ టీమ్ ఈవెంట్ ఫైనల్‌లో పాకిస్తాన్‌ని 2-1 తేడాతో భారత్ ఘన విజయం...
ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల స్క్వాష్ టీమ్ ఈవెంట్ ఫైనల్‌లో పాకిస్తాన్‌ని 2-1 తేడాతో విజయం సాధించింది భారత జట్టు. మొదటి మ్యాచ్‌లో భారత స్క్వాష్ ప్లేయర్ మహేశ్ మంగోకర్, పాక్ ప్లేయర్ నసీర్ చేతుల్లో 3-0 తేడాతో ఓడాడు. అయితే వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చారు భారత స్క్వాష్ ప్లేయర్లు.
అయితే శ్రేయాస్ ఘోషల్ రెండో మ్యాచ్‌లో గెలిచి 1-1 మ్యాచ్‌ని టై చేశాడు. ఆ తర్వాత అభయ్ సింగ్, డిసైడర్ మ్యాచ్‌ని 3-2 తేడాతో గెలుచుకున్నాడు. దీంతో భారత స్క్వాష్ పురుషుల జట్టుకి పసిడి పతకం దక్కింది. తొలి రెండు సెట్లు ఓడి 0-2 తేడాతో వెనకబడిన తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి, పాక్‌కి ఊహించని షాక్ ఇచ్చాడు అభయ్ సింగ్..
మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో భారత గోల్డెన్ లేడీ మీరాబాయి ఛాను నిరాశపరిచింది. స్కాచ్ రౌండ్‌లో 83 కిలోలు ఎత్తిన మీరాబాయి ఛాను, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 108 కిలోలు ఎత్తింది. అయితే ఓవరాల్‌గా 191 కిలోలతో నాలుగో స్థానంలో నిలిచిన మీరాబాయి, పతకాన్ని మిస్ చేసుకుంది..
బాక్సింగ్ పురుషుల 92 కిలోల విభాగంలో భారత బాక్సర్ నరేంద్ర బేర్వాల్ సెమీస్ చేరాడు. సెమీస్‌లో విజయం సాధిస్తే, నేరుగా ఒలింపిక్స్‌కి అర్హత సాధిస్తాడు నరేంద్ర..
43 ఏళ్ల భారత టెన్నిస్ వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న సంచలనం క్రియేట్ చేశాడు. మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో ఫైనల్ చేరిన భారత జోడి రోహన్ బోపన్న, రుతురాజ్ భోసలే స్వర్ణం కైవసం చేసుకుంది. చైనీస్ తైపాయ్ జోడితో జరిగిన ఫైనల్‌లో 2-6, 6-3, 10-4 తేడాతో విజయం అందుకున్నారు రోహన్ బోపన్న - రుతురాజ్ భోసలే..
టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన భారత టీటీ ప్లేయర్ మానికా బత్రా, వరల్డ్ నెం.4 వాంగ్ యిదీతో జరిగిన మ్యాచ్‌లో 2-4 తేడాతో ఓడిపోయింది. మహిళల బాక్సింగ్‌లో 75 కిలోల విభాగంతో భారత స్టార్ బాక్సర్ లోవ్‌లినా బోర్గోహైన్, సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లింది.