యువరాజ్, రైనాల వల్లే కాలేదు.. యో - యో టెస్టులో పాసైన గంభీర్ కూతురు... ప్రశంసల జల్లు

First Published 23, Jul 2018, 7:20 PM IST
gautam gambhir daughter azin passes yoyo test
Highlights

కఠినతరమైన యో యో టెస్టులో గౌతమ్ గంభీర్ గారాలపట్టి సులభంగా ఉత్తీర్ణత సాధించింది. చిన్న చిన్న ఫిట్‌నెస్ టెస్టులు చేస్తున్న తన పెద్ద కూతురు అజీన్ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టాడు

టీమిండియాలో చోటు కావాలంటే ఎవరైనా యో యో టెస్ట్ పాసవ్వాల్సిందేనంటూ ఇటీవల బీసీసీఐ షరతు పెట్టిన సంగతి తెలిసిందే. యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, అశ్విన్, అంబటి రాయుడు లాంటి స్టార్లు కూడా ఈ టెస్టులో పాసవ్వలేక జట్టులో స్థానం కోల్పోయారు.

మరోసారి అవకాశం ఇవ్వడంతో రెండో సారి ఉత్తీర్ణత సాధించారు. ప్రతిభకు ఇలాంటి పరీక్షలు కొలమానం కాదని.. దీనిని తొలగించాలంటూ అనేక మంది సీనియర్లు దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతటి కఠినతరమైన టెస్టులో గౌతమ్ గంభీర్ గారాలపట్టి సులభంగా ఉత్తీర్ణత సాధించింది. చిన్న చిన్న ఫిట్‌నెస్ టెస్టులు చేస్తున్న తన పెద్ద కూతురు అజీన్ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టాడు.

‘‘ నా పెద్ద కూతురు యో- యో టెస్ట్ పాసైనట్లుగా ఉంది కదూ.. మీకేమనిపిస్తోంది యువరాజ్, హర్భజన్, సచిన్ అంటూ వాళ్లకు ట్యాగ్ చేశారు.. దీనిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. చాలా బాగా చేశావని.. లిటిట్ సూపర్‌స్టార్ అంటూ ప్రశంసిస్తున్నారు.

loader