Asianet News TeluguAsianet News Telugu

Football Gallery: ఫుట్బాల్ మ్యాచ్ చూస్తుండగా కుప్పకూలిన గ్యాలరీ.. 200 మందికి గాయాలు.. కేరళలో తీవ్ర విషాదం

Football Gallery collapsed in Kerala: కేరళలో  క్రికెట్  కంటే ఫుట్బాల్ కే క్రేజ్ ఎక్కువ.  సాధారణంగా మనం గ్రామాల్లో క్రికెట్ టోర్నీలు నిర్వహించినట్టు అక్కడ ఫుట్బాల్ టోర్నీలు నిర్వహిస్తారు. అయితే ఓ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఉన్నట్టుండి గ్యాలరీ కూలిపోయి.... 

Gallery Collapsed during Football Match in Kerala, 200 People Suffered Injuries
Author
India, First Published Mar 20, 2022, 2:29 PM IST

ఫుట్బాల్ మ్యాచ్ చూద్దామని వచ్చిన వారికి  శనివారం రాత్రి కాలరాత్రిలా గడిచింది. తమకు ఎంతో ఇష్టమైన ఫుట్బాల్ మ్యాచ్ చూస్తుండగా.. ఉన్నట్టుండి ప్రేక్షకులు కూర్చున్న గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఈ ఘటనలో సుమారు 200 మందికి పైగా గాయపడ్డారు కేరళలో  శనివారం రాత్రి 9 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  వెదురుబొంగులతో  తాత్కాలికంగా ఏర్పాటుచేసిన గ్యాలరీ లో దాని సామర్థ్యం కంటే ఎక్కువ మంది కూర్చోవడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. 

కేరళలోని మలప్పురం జిల్లాలో శనివారం రాత్రి 9గంటలకు ఈ ఘటన జరిగింది. పూన్గోడు లో వందూర్, కలికావు మధ్య జరిగిన మ్యాచు సందర్భంగా ఈ విషాదం చోటు చేసుకుంది.ప్రమాదం జరిగిన సమయంలో పోలీసులు, ఇతర సిబ్బంది అక్కడే ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.  

కేరళలో  క్రికెట్ కంటే ఫుట్బాల్  ఆట చాలా ఫేమస్. ఈ క్రమంలోనే స్థానికంగా కూడా పలు టోర్నీలను నిర్వహిస్తారు నిర్వాహకులు. ఇందులో భాగంగానే ఫుట్బాల్ పై మక్కువతో  వందూర్-కలికావు మధ్య జరిగిన మ్యాచును తిలకించడానికి వందల సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చారు. అయితే  ఇందుకు నిర్వాహకులు మాత్రం  గ్యాలరీని వెదురుబొంగులతో తయారు చేయించారు.  కానీ భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడంతో  అది  సామర్థ్యాన్ని మించిపోయింది. దీంతో  అది ఒక్కసారిగా కుప్పకూలింది. 

 

ఈ విషాద ఘటనలో  200 మందికి గాయాలయ్యాయి.  వీరిలో సుమారు పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారుు. గాయపడ్డ వారిలో చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం. 

ప్రమాదం జరిగిన వెంటనే  బాధితులను ఆస్పత్రికి తరలించారు. కొంతమందిని స్థానికంగా ఉండే ప్రభుత్వాస్పత్రుల్లో చేర్పించగా.. మరికొందరిని ముంజేరిలో ప్రభుత్వ వైద్య కళాశాలకు చేర్పించారు.  గ్యాలరీ కూలిపోతున్న సమయంలో అక్కడ పోలీసు సిబ్బంది కూడా భారీ సంఖ్యలో ఉండటం.. వాళ్లు త్వరగా స్పందించి బాధితులను ఆస్పత్రికి తరలించడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios