ఫిఫా-2018లో బెస్ట్ గోల్: మెస్సీది కాదు.. రోనాల్డోది అంతకన్నా కాదు

France football player benjamin pavard wins goal Of the FIFA 2018
Highlights

 ఫుట్‌బాల్ దిగ్గజాలు మెస్సీ, రోనాల్డో వంటి దిగ్గజాలను నెయిమర్, సురేజ్, గ్రీజ్‌మెన్ వంటి స్టార్లను పక్కకునెట్టి ఫ్రాన్స్‌ యువ సంచలనం బెంజిమిన్ పవార్డ్ నమోదు చేసిన గోల్‌ను 2018 ప్రపంచకప్‌లో అత్యుత్తమమైనదిగా ఫిఫా ప్రకటించింది

ఈ ఏడాది ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ అభిమానులకు ఆశించిన దానికన్నా ఎక్కువ వినోదాన్ని అందించింది. అంతగా అభిమానులను అలరించిన ఈ టోర్నీలో అత్యుత్తమ గోల్ ఎవరు నమోదు చేశారు. ఫుట్‌బాల్ దిగ్గజాలు మెస్సీ, రోనాల్డో వంటి దిగ్గజాలను నెయిమర్, సురేజ్, గ్రీజ్‌మెన్ వంటి స్టార్లను పక్కకునెట్టి ఫ్రాన్స్‌ యువ సంచలనం బెంజిమిన్ పవార్డ్ నమోదు చేసిన గోల్‌ను 2018 ప్రపంచకప్‌లో అత్యుత్తమమైనదిగా ఫిఫా ప్రకటించింది.

బెస్ట్ గోల్‌కు సంబంధించి ఫిఫా అభిమానులకు ఓటింగ్ నిర్వహించింది. దీనిలో అర్జెంటీనాతో  జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో 57వ నిమిషంలో పవార్డ్ కొట్టిన గోల్ ఫుట్‌బాల్ అభిమానుల మనసును దోచుకుంది. దాదాపు 16 మీటర్ల దూరం నుంచి అతను తన్నిన బంతి అర్జెంటీనా రక్షణశ్రేణిని ఛేదించి గోల్‌ పోస్ట్‌లో పడింది. ఈ ఏటీ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను ఫ్రాన్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.. ఫైనల్లో క్రొయేషియాను ఓడించి ఫ్రెంచ్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది.

loader