టోక్యోలో సరికొత్త చరిత్ర... ఫైనల్స్‌కి అర్హత సాధించిన ఈక్వెస్ట్రైయిన్ ఫౌద్ మీర్జా...

వ్యక్తిగత జంపింగ్ క్వాలిఫైయర్‌లో 76: 14 సెకన్లలో జంపింగ్‌ను పూర్తి చేసి, 25వ స్థానంలో నిలిచిన మీర్జా...

మొదటి ఒలింపిక్స్‌లోనే ఫైనల్స్‌కి అర్హత సాధించిన ఈక్వెస్ట్రైయిన్ ఫౌద్ మీర్జా...

Fouaad Mirza and Seigneur Medicott have qualified for the  Equestrian Jumping Final event CRA

టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ మరో సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. ఈక్వెస్ట్రైయిన్ ఈవెంట్‌లో తొలిసారిగా బరిలో దిగిన భారత అథ్లెట్ ఫౌద్ మీర్జా...  ఈక్వెస్ట్రైయిన్ జంపింగ్ ఈవెంట్‌లో ఫైనల్‌కి అర్హత సాధించాడు...

తన గుర్రం సినియర్ మెరికాట్‌తో కలిసి ఈవెంట్‌లో పాల్గొన్న మీర్జా, వ్యక్తిగత జంపింగ్ క్వాలిఫైయర్‌లో 76: 14 సెకన్లలో జంపింగ్‌ను పూర్తి చేశాడు. 8 పెనాల్టీ పాయింట్లతో మొత్తంగా 25వ స్థానంలో నిలిచిన మీర్జా... ఫైనల్‌కి అర్హత సాధించాడు... 

అంతకుముందు వుమెన్స్ హాకీలో భారత జట్టు, ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌లోకి ప్రవేశించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత షూటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. 50 మీటర్ల రైఫిల్ 3పీ ఈవెంట్‌లో పోటీపడిన ఐశ్వరీ ప్రతాప్ తోమర్, సంజీవ్ రాజ్‌పుత్ 21వ, 32వ స్థానంలో నిలిచి ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios