'టోలిచౌకి కుర్రాడు అదరగొట్టాడు ': సిరాజ్ పై జక్కన్న ప్రశంసలు
SS Rajamaouli: భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ పై దర్శక ధీరుడు ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో టోలిచౌకి కుర్రాడు ఆరు వికెట్లను పడగొట్టి అద్భుతమైన బౌలింగ్ చేసాడంటూ కొనియాడారు.

SS Rajamaouli: వన్డే ప్రపంచ కప్ ముందు టీమిండియా అద్భుతమైన ప్రదర్శనతో యావత్ క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుంది. ఆదివారం నాడు శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్ 2023 కైవసం చేసుకోండి. ఈ సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో ఆతిథ్య శ్రీలంక పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన బౌలింగ్ తో విరుచుకుపడ్డాడు. ఆయన కేవలం 21 పరుగులు ఇచ్చి ఏకంగా 6 వికెట్లను పడగొట్టాడు. కేవలం 50 పరుగులకు కట్టడి చేయడంలో బౌలర్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. టీమిండియా పెసర్ సిరాజ్ ఓకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి శ్రీలంకను చావు దెబ్బ కొట్టారు. ఇలా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన సిరాజ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో హైదరాబాది బౌలర్ సిరాజ్ పై టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించాడు. టోలిచౌకి కుర్రాడు ఆరు వికెట్లను పడగొట్టి అద్భుతమైన బౌలింగ్ చేసాడంటూ కొనియాడారు. సోషల్ మీడియాలో దర్శక ధీరుడు రాజమౌళి ట్రీట్ చేస్తూ.. సిరాజ్ మియాన్ మన టోలిచౌకి కుర్రాడు ఆసియా ప్రపంచకప్ ఫైనల్లో ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకొని మెరిశాడు. డైరెక్టర్ ఎస్ రాజమౌళి ఇలా ట్విట్ చేశారు. సిరాజ్ మియాన్ మన టౌలీచౌకి కుర్రాడు ఆసియా కప్ ఫైనల్లో ఆరు వికెట్లు పడగొట్టి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు అంతే కాదు తన బౌలింగ్లో బౌండరీని ఆపడానికి లాంగ్ ఆన్ కి పరిగెత్తి అందరి హృదయాలను గెలిచాడు అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్టు నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది. బౌలర్ సిరాజ్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఫైనల్ మ్యాచ్లో.. అది కూడా శ్రీలంక లాంటి జట్టును కేవలం 50 పరుగులకు కట్టడి చేయడం అంత మామూలు విషయం కాదు.