ఫ్లాష్‌బ్యాక్: ఫోనిక్స్ పక్షిలా పైపైకి స్పెయిన్.. రష్యాలో ఇలా ఆధిపత్య యత్నం

FIFA World Cup 2018: Dominant Spain head to Russia as strong title contenders
Highlights

ఫోనిక్స్ పక్షిలా పైపైకి స్పెయిన్.. రష్యాలో ఇలా ఆధిపత్య యత్నం 

హైదరాబాద్: అంతర్జాతీయ ఫుట్‌బాల్ రంగంలో స్పెయిన్‌కు ఒక ప్రత్యేకత ఉన్నది. పలు లీగ్ క్లబ్‌లకు వేదిక ఇది. లా లీగ నుంచి కొపా డెలెరే నుంచి సూపర్ కోపా, సెగుండా, కొపా ఫెడరేషన్, రాయల్ స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఇలా పలు ఫుట్ బాల్ సంస్థలకు నిలయం స్పెయిన్. ఒక్కమాటలో చెప్పాలంటే స్పెయిన్ ప్రస్తుతం ఫుట్ బాల్ కేంద్రమని కూడా పేర్కొనవచ్చు. క్రిస్టియానో రొనాల్డో, లియానెల్ మెస్సీ, మహ్మద్ సలాహ్, నేయ్మార్ వంటి కీలక ఆటగాళ్లు స్పెయిన్ లీగ్ టోర్నీల్లో పాల్గొన్న వారే కావడం గమనార్హం. ఇలా స్పెయిన్ ఫుట్‌బాల్ ఆటలో ఫోనిక్స్ పక్షి మాదిరిగా గత దశాబ్ధ కాలంలో ఎదుగుతూ వచ్చింది. కేవలం రెండు యూరోపియన్ చాంపియన్ షిప్ టైటిళ్లు, ఒక వరల్డ్‌కప్ గెలుపొందడంతోనే సంత్రుప్తి పడలేదు. అత్యాధునిక ఫుట్‌బాల్ ప్లేయర్, బ్రెజిల్‌కు చెందిన పీలే, అంతకుముందు 1954లో మ్యాజికల్ మాగ్యార్స్ మాదిరిగా హంగేరీ విజయం వంటి అంశాలు అంతర్జాతీయ ఫుట్‌బాల్ రంగంపై ఒక ఊహాచిత్రాన్ని ఆవిష్కరించాయి. స్పెయిన్ టీంలో ఉత్కృష్టమైన పద్ధతితో కూడిన ఆటతీరుపై ఒక ప్రత్యేక ముద్ర వేశాయి. 

లూయిస్ ఆరాగోనెస్ సారథ్యంలో స్పెయిన్ టీంకు మెరుగులు
లూయిస్ ఆరాగోనెస్ ఆధ్వర్యంలో స్పెయిన్ సాకర్ జట్టు 2008లో యూరో చాంపియన్ షిప్ గెలుచుకోవడంతో ఫుట్‌బాల్ రంగంలో దాని ప్రయాణం మొదలైంది. రెండేళ్ల తర్వాత 2010లో లూయిస్ ఆరాగోనెస్ శిష్యుడు విన్సెంట్ డెల్ బాస్క్ సారథ్యంలో వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకోవడంతో అంతర్జాతీయ ఫుట్ బాల్‌కు నూతన చక్రవర్తి స్థానాన్ని ఆక్రమించింది స్పెయిన్. 
 

విన్సెంట్ డెల్ బాస్క్ ఆధ్వర్యంలో రెండోసారి ఈయూ చాంప్
విన్సెంట్ డెల్ బాస్క్ ఆధ్వర్యంలో 2012లో స్పెయిన్ జట్టు రెండోసారి యూరోపియన్ చాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకున్నది. ఇటలీపై జరిగిన యూరోపియన్ చాంపియన్ షిప్ టైటిల్ పోరులో 4 - 0 స్కోర్ తేడాతో గెలుపొందింది. ఇలా వరుసగా మూడు టోర్నమెంట్లలో వరుసగా గెలుపొందడంతో నూతన జవసత్వాలు సంపాదించుకున్నది స్పెయిన్. 
 

2014 వరల్డ్ కప్‌పై ఆశలు అడియాసలు
స్పెయిన్ జట్టు మేనేజ్మెంట్‌లో ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకోవాలన్న కల మొదలైంది. అదీ 2014 వరల్డ్ కప్ చాంపియన్ షిప్‌ను నిలుపు కోవాలన్న ఆశలు అడియాసలయ్యాయి. 2014 టోర్నమెంట్‌లో ప్రారంభంలోనే డచ్, చిలీ జట్ల చేతిలో ఓటమి పాలై స్పెయిన్ తన ఆశలు వదులుకున్నది. తిరిగి రెండేళ్ల తర్వాత 2016లో యూరోపియన్ చాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకోవడంలోనూ విఫలమైన దరిమిలా జట్టు నుంచి విన్సెంట్ డెల్ బాస్క్ నిష్క్రమించాల్సిన పరిస్థితి నెలకొంది. జట్టును పూర్తిగా పునర్వ్యవస్థీకరించారు. 
 

యువతరంతో స్పెయిన్‌కు పూర్వ వైభవం సాధ్యమేనా?
ఈ దఫా టోర్నీలో శుభారంభాన్ని అందుకుంటే స్పెయిన్ తన గత పూర్వ వైభవాన్ని సంతరించుకోగలదని అంచనా వేస్తున్నారు. ఇనైస్టా, సెర్జియో రామోస్, డేవిడ్ సిల్వా వంటి చాకుల్లాంటి కుర్రాళ్లతోపాటు ఫ్రాన్సిస్కో ఇస్కో  ఆలార్కన్, మార్కో అసెంసియో వంటి కొత్తగా యువ రక్తం స్పెయిన్ టీంకు అందుబాటులోకి వచ్చింది. పెప్ గౌరాడియోలా శిక్షకుడిగా బార్సిలోనా క్లబ్ జట్టు లా లీగా, చాంపియన్స్ లీగ్ టైటిళ్ల పరిధిలో శక్తిమంతమైన జట్టుగా ఎదిగింది.
 

స్పెయిన్ జట్టుపై బార్సిలోనా క్లబ్ ముద్ర
2010 వరల్డ్ కప్ టైటిల్‌ను గెలుచుకున్న స్పెయిన్ జట్టులో ఏడుగురు, 2012లో జరిగిన యూరోపియన్ చాంపియన్ షిప్ టోర్నీలో ఆరుగురు బార్సిలోనా క్లబ్‌ ప్లేయర్లే కావడం గమనార్హం.
 

రియల్ మాడ్రిడ్ కంటే బార్సిలోనా జట్టుకే ఎక్కువ ప్రాధాన్యం
ఇటీవల ‘లా లీగా’ లీగ్‌లో పూర్తిగా యువరక్తంతో కూడిన ప్లేయర్లు గల రియల్ మాడ్రిడ్ జట్టు విజయాలు సాధించడంతో అందరి ద్రుష్టిని కేంద్రీకరించింది. ప్రస్తుతం స్పెయిన్ జట్టు ఆటతీరులో బార్సిలోనా క్లబ్ మార్కు ఎక్కువగా కనిపిస్తున్నదని చెబుతున్నారు. 
 

loader