ఫ్రాన్స్ ఫిఫాను ఇలా ముద్దాడింది..అసలు హీరోలు ఎవరంటే..?

2018 ఫిఫా వరల్డ్‌కప్‌ను గెలుచుకుని ఫ్రాన్స్ విశ్వవిజేతగా అవతరించింది. కానీ ఈ ఏడాది ఫ్రాన్స్ జగజ్జేత అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు..

FIFA 2018 : France route to World Cup

2018 ఫిఫా వరల్డ్‌కప్‌ను గెలుచుకుని ఫ్రాన్స్ విశ్వవిజేతగా అవతరించింది. కానీ ఈ ఏడాది ఫ్రాన్స్ జగజ్జేత అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు.. జర్మనీ, బ్రెజిల్, స్పెయిన్ వంటి అగ్రశ్రేణి జట్లు బలమైన ఆటగాళ్లతో, భీకరమైన ఫాంలో ఉన్నాయి. వీటిలో ఏదో ఒక జట్టు కప్ ఎగరేసుకెళ్తుందని అందరూ భావించారు. తలపండిన విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు, అభిమానులు అందరి అభిప్రాయం ఇదే.

కానీ అంచనాలను తారుమారు చేస్తూ ఫ్రాన్స్ కప్‌ను ముద్దాడింది. గ్రూప్ దశలో పడుతూ లేస్తూ సాగింది ఫ్రెంచ్ జట్టు.. అత్యంత బలహీనమైన ఆస్ట్రేలియా, పెరూలను ఎదర్కోవడానికి ఈ అగ్రశ్రేణి జట్టు చెమటోడ్చాల్సి వచ్చింది. ఇలాంటి జట్టు ప్రీక్వార్టర్స్, క్వార్టర్స్‌లో జూలు విదిల్చింది. ఎటాకింగ్, డిఫెన్స్‌తో మ్యాచ్ మ్యాచ్‌కి రాటుదేలింది. 

ఏయే జట్లను ఓడించిందంటే: ఫ్రాన్స్ గ్రూప్ ‘సి’లో బరిలో దిగింది.

గ్రూప్‌లో: ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో గెలుపు, పెరూపై 1-0తో గెలుపు, డెన్మార్క్‌తో 0-0తో డ్రా.

ప్రిక్వార్టర్స్‌లో : అర్జెంటీనాపై 4-3తో గెలుపు
క్వార్టర్స్‌లో : ఉరుగ్వేపై 2-0తో గెలుపు
సెమీస్‌లో : బెల్జియంపై 1-0తో గెలుపు
ఫైనల్లో : క్రొయేషియాపై 4-2తో గెలుపు

మొత్తం చేసిన గోల్స్: 14
ప్రత్యర్థులకు ఇచ్చిన గోల్స్: 6

టాప్ స్కోరర్లు: గ్రీజ్‌మన్ (4), ఎంబపె ( 4)

* ఫ్రాన్స్ ఫిఫా ట్రోఫి గెలవడం ఇది రెండవ సారి.. 1998లో మొదటి సారి ఆ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది.

* 1970 తర్వాత ఫైనల్లో నాలుగు గోల్స్ కొట్టిన ఏకైక జట్టు ఫ్రాన్స్.

"

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios