సమఉజ్జీల సమరం.. ఫైనల్స్ చేరేది ఎవరో..?

ఫిఫా వరల్డ్‌కప్‌ 2018లోనే అసలు సిసలు మజా అందించడానికి రంగం సిద్ధమైంది.. ఇవాళ్టీ నుంచి సెమీఫైనల్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. తొలి మ్యాచ్‌లో మాజీ విశ్వవిజేత ఫ్రాన్స్‌తో సంచలనాల బెల్జియం తలపడనుంది

FIFA 2018: analysis on france vs belgium semi final

ఫిఫా వరల్డ్‌కప్‌ 2018లోనే అసలు సిసలు మజా అందించడానికి రంగం సిద్ధమైంది.. ఇవాళ్టీ నుంచి సెమీఫైనల్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. తొలి మ్యాచ్‌లో మాజీ విశ్వవిజేత ఫ్రాన్స్‌తో సంచలనాల బెల్జియం తలపడనుంది. ఎటాకింగ్‌, డిఫెండింగ్, వేగం ఇలా అన్నింట్లో రెండు జట్లూ సమంగా నిలుస్తుండటంతో విజేతను ముందుగా అంచనా వేయడం కాకలు తీరిన విశ్లేషకులకు కూడా అంతుబట్టడం లేదు.

కిలియన్ ఎంబపె ఫ్రాన్స్ ప్రధాన అస్త్రం.. 19 ఏళ్ల ఈ యువ స్ట్రైకర్ బెల్జియం రక్షణశ్రేణికి సవాలు విసురుతున్నాడు. ఇతనికి తోడుగా పోగ్బా, గ్రీజ్‌మన్ వంటి స్టార్ స్ట్రైకర్లు... పవార్డ్, వరానె, హెర్నాండ్‌తో ఫ్రాన్స్‌ డిఫెన్స్ దుర్భేద్యంగా ఉంది..  ఇక బెల్జియం ఆశలన్నీ  ఫార్వార్డ్ రోమేలు లుకాకుపైనే... భారీ కాయంతో శత్రువులను భయపెడుతూ... టోర్నీలో ఇప్పటివరకు నాలుగు గోల్స్ కొట్టి బెల్జియం సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు.

ఇక బెల్జియం రక్షణ వ్యవస్థ కూడా దుర్భేద్యంగానే ఉంది.. వెర్టాంగెన్‌, డిబ్రుయిన్, కెప్టెన్ హజార్డ్‌లు జూలు విదిలిస్తే.. ఫ్రాన్స్‌కు కష్టాలు తప్పవు.. ఈసారీ గోల్ కీపర్ల చేతుల్లోనే మ్యాచ్ ఫలితం ఉండేలా కనిపిస్తుంది.. బెల్జియం గోల్ కీపర్ తిబౌత్ కోర్ట్‌వా, ఫ్రాన్స్ గోల్ కీపర్ లారీస్‌లు తమ అత్యుత్తమ ప్రదర్శన కొనసాగించాలని ఫుట్‌బాల్ పండితులు అంటున్నారు.

ఫ్రాన్స్‌కు బెల్జియం చిరకాల ప్రత్యర్థి..ఆ జట్టు అత్యధికంగా తలపడింది బెల్జియంతోనే.. ఇప్పటి వరకు ఇరు జట్లు 73 మ్యాచ్‌లు ఆడగా... బెల్జియం 30 మ్యాచ్‌ల్లో... ఫ్రాన్స్ 24 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. 19 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఈ రెండు జట్లు ఫిఫా ప్రపంచకప్‌లో రెండు సార్లే ఎదురుపడ్డాయి. ఈ రెండింటిలోనూ ఫ్రాన్స్‌దే విజయం. మొదటిసారి 1938లో, రెండవసారి 1986లో ఇరు జట్లు తలపడ్డాయి.

ఈ ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ నాలుగు విజయాలు, ఒక డ్రా, బెల్జియం ఐదు విజయాలు సాధించాయి. 14 గోల్స్ సాధించగా.. ప్రత్యర్థులకు 5 గోల్స్ ఇచ్చింది.. ఫ్రాన్స్ 9 గోల్స్ కొట్టగా.. ప్రత్యర్థులకు 4 గోల్స్ సమర్పించుకుంది. ఇరు జట్ల ప్రదర్శనను విశ్లేషించగా.. ఫ్రాన్స్‌కు 61.17%.. బెల్జియంకు 38.83% విజయావకాశాలు ఉన్నాయి.

"

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios