లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో అమెరికాలో ఒలింపిక్ మాజీ జిమ్నాస్టిక్ కోచ్ జాన్ గెడ్డార్ట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన అమెరికాలోని వాషింగ్టన్ నగరానికి సమీపంలో జరిగింది. ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్స్ కోచ్‌గా వ్యవహారించిన జాన్ గెడ్డార్ట్, మిచిగన్ ఏరియాలో ఓ మహిళా జిమ్నాస్టిక్స్ ట్రైనింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు.

ఈ సెంటర్‌లోనే డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న లారీ నాసర్, కోచ్ జాన్ గెడ్డార్ట్‌ కలిసి జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ కోసం వచ్చిన బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు మానసికంగా కూడా హింసించేవారంటూ నాసల్ అనే ఓ వ్యక్తి, సంచలన ఆరోపణలు చేశాడు.

నాసల్ ఆరోపణలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. 13, 16 ఏళ్ల లోపు బాలికలపై జాన్ గెడ్డార్ట్‌, నాసర్‌ లైంగికంగా వేధించేవారని తేల్చారు.

ఓ బాలిక తల్లి కూడా తన కూతురు, ఈ విషయాలు చెప్పుకొని ఏడ్చిందని తెలియచేసింది. ఇదిలా ఉండగా మాజీ జిమ్నాస్ట్ రాచెల్ డెస్‌ హోలాండర్, గెడ్డార్ట్ ఒలింపిక్ కోచ్‌గా ఉన్న సమయంలో లైంగికంగా వేధించేవాడంటూ 21 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను బయటపెట్టింది.