మరో మైలురాయి: దిగ్గజాల సరసన ధోనీ

First Published 15, Jul 2018, 11:22 AM IST
England vs India: MS Dhoni breaks another monumental ODI record
Highlights

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ మరో మైలురాయి దాటాడు. శనివారం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద అనతు 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

లండన్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ మరో మైలురాయి దాటాడు. శనివారం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద అనతు 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన నాలుగో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 

సచిన్‌ టెండూల్కర్‌, ద్రవిడ్‌, సౌరవ్‌ గంగూలీలు ధోని కన్న ముందు ఈ మైలురాయిని అందుకున్నారు. మొత్తంగా ఈ ఫీట్‌ అందుకున్న 12వ బ్యాట్స్‌మన్‌గా ఈ 36 ఏళ్ల ఆటగాడు నిలిచాడు. 

ఈ జాబితాలో 18,426 పరుగులతో భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అగ్రస్థానంలో  ఉన్నాడు. ఆ తర్వాత సంగక్కర(14,234), రికీ పాటింగ్‌ (13,704), జయసూర్య(13,430), మహేల జయవర్ధనే (12,650), ఇంజమామ్‌ ఉల్‌ హక్‌(11,739), జాక్విస్‌ కల్లీస్‌ (11,579), సౌరవ్‌ గంగూలీ(11,363), ద్రావిడ్‌(10,889), బ్రియాన్‌ లారా (10,405), దిల్షాన్‌ (10,290)లు ఉన్నారు.

10వేల మార్క్‌ను దాటిన రెండో వికెట్‌ కీపర్‌గా ధోని మరో రికార్డు నమోదు చేశాడు. ఈ ఘనతను తొలి వికెట్‌ కీపర్‌గా కుమార సంగక్కర సాధించాడు. అంతకుముందు 300 క్యాచ్‌ల క్లబ్‌లో చేరాడు. 

ఈ ఘనతెక్కిన నాలుగో వికెట్‌ కీపర్‌గా ధోని నిలిచాడు. గిల్‌క్రిస్ట్‌ (417), బౌచర్‌ (403), సంగక్కర (402) ముందు వరుసలో ఉన్నారు. 

loader