ఆ రికార్డు బద్ధలవుతుందా... టెస్టు క్రికెట్‌లో ఏ జట్టు ఇంగ్లాండ్‌ను దాటలేదేమో..?

england ready to play 1000th test
Highlights

క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ టెస్టుల్లో అరుదైన ఘనతను అందుకోనుంది.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 1000 టెస్టులు ఆడిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించనుంది.. 

క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ టెస్టుల్లో అరుదైన ఘనతను అందుకోనుంది.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 1000 టెస్టులు ఆడిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించనుంది.. ఇప్పటి వరకు 999 టెస్టులు ఆడిన ఇంగ్లీష్ జట్టుకు త్వరలో భారత్‌ జరగనున్న తొలి టెస్ట్ 1000వ టెస్ట్ మ్యాచ్.

1877లో జేమ్స్ లిల్లీవైట్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు.. మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ఆడింది.. 140 ఏళ్ల ఆ జట్టు టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు 999 మ్యాచ్‌లు ఆడి.. 357 మ్యాచ్‌లు గెలిచి.. 297 మ్యాచ్‌ల్లో ఓడిగా.. 345 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి..

అత్యధిక టెస్టులాడిన జట్ల జాబితాలో ఆస్ట్రేలియా 812 మ్యాచ్‌లతో రెండో స్థానంలో... 535 మ్యాచ్‌లతో వెస్టిండీస్ మూడవ స్థానంలో... 522 మ్యాచ్‌లతో భారత్ నాలుగో స్థానంలో నిలిచాయి.

loader